కీలకమైన టెలికమ్యూనికేషన్స్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. దేశ భద్రత దృష్యా, ప్రజా సంక్షేమానికి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం టెలికాం సేవలను తాత్కాలికంగా నియంత్రణలోకి తీసుకునే అధికారాన్ని ఈ చట్టం ఇస్తున్నది.
పార్లమెంటులో ఆమోదం పొందిన టెలికమ్యూనికేషన్స్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023కి డిసెంబర్ 24వ తేదీన రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ చట్టం ద్వారా టెలికాం సేవలను దేశ భద్రత దృష్ట్యా తాత్కాలికంగా నియంత్రణలోకి తీసుకునే అధికారం ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. అంతేకాదు, శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం వేలం వేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉండదు. ప్రజా భద్రత, ప్రజా అత్యయిక పరిస్థితుల్లోనూ ప్రభుత్వం టెలికాం నెట్‌వర్క్‌ను తన అధీనంలోకి తీసుకునే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తుంది.
ప్రజా అత్యవసర పరిస్థితుల్లోనూ మెస్సేజీల భట్వాడ చేయడాన్ని కూడా ఆపే అవకాశం ప్రభుత్వానికి చిక్కుతుంది. తద్వార ఆందోళనలను, ఉద్రికత్తలను తగ్గించడానికి ప్రభుత్వానికి సులువు అవుతుంది. కొన్ని సార్లు ఉద్రిక్త పరిస్థితుల్లో రెచ్చగొట్టే మెస్సేజీలు, సమాచారాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వానికి చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం నేరుగా టెలికాం నెట్‌వర్క్‌ను నియంత్రణలోకి తీసుకుని మెస్సేజీలను ఆపడానికి వీలవుతుంది.
Also Read : క్లాస్‌మేట్‌ను పెళ్లి చేసుకోవాలని సెక్స్ చేంజ్ చేసుకుంది.. తర్వాత ఆమెనే చంపేసింది
ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదలయ్యాక ఈ చట్టం అమల్లోకి వస్తుందని యూనియన్ లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ తెలిపింది. ఈ చట్టం 138 ఏళ్ల ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం స్థానంలో వచ్చింది. కొత్త చట్టంతో ప్రభుత్వానికి పలు అంశాలు కలిసి రానున్నాయి.