దక్షిణాది బీజేపీ ఎంపీలతో మోడీ భేటీ: అల్పాహర విందు, భవిష్యత్తుపై దిశా నిర్ధేశం

Published : Dec 15, 2021, 11:49 AM ISTUpdated : Dec 15, 2021, 11:57 AM IST
దక్షిణాది బీజేపీ ఎంపీలతో మోడీ భేటీ:  అల్పాహర విందు, భవిష్యత్తుపై దిశా నిర్ధేశం

సారాంశం

దక్షిణాది రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాడు సమావేశమయ్యారు. పార్టీ ఎంపీలతో కలిసి ఆయన బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చించారు.

న్యూఢిల్లీ: Southern states కి చెందిన  బీజేపీఎంపీలతో ప్రధాన మంత్రి Narendra Modi బుధవారం నాడు భేటీ అయ్యారు.2023 సాధారణ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుండి బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ ఎంపీలకు మోడీ దిశా నిర్ధేశం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని Bjp ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే  ఆయా రాష్ట్రాల్లో  పార్టీ బలోపేతంపై చర్చించారు మోడీ.  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ప్రజలకు అందుతున్న తీరుపై కూడా ఎంపీలతో ప్రధాని చర్చించారు. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై కూడా మోడీ చర్చించారు. 

ఎంపీలకు మోడీ అల్పాహర విందు

ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, విపక్ష పార్టీల పనితీరుపై కూడా మోడీ పార్టీ ఎంపీలతో చర్చించారు. Parliament సమావేశాలను పురస్కరించుకొని పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో మోడీ Break fast విందు ఇస్తున్నారు. ఇాళ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. మోడీతో సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు హాజరయ్యారు. ఇక, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీలు జీవిఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ సమావేశంలో పాల్గొన్నారు.దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై బీజేపీ నాయకత్వం ప్రధానంగా కేంద్రీకరించింది.  తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీకి ఇటీవల మెరుగైన ఫలితాలు కన్పిస్తున్నాయి.  

also read:రేపు ఏపీ, తెలంగాణల్లోని బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ

దీంతో ఆ పార్టీ క్యాడర్ లో జోష్ కన్పిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ నాయకత్వం కేంద్రీకరించింది. 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ తెలంగాణ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనతో కలిసి 2024లో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహారచన చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై  పోరాటం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వాలకు కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారు. గత మాసంలో తిరుపతిలో టూర్ సందర్భంగా ఏపీ రాష్ట్ర నేతలకు అమిత్ షా ఈ సూచనలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో పాల్గొనాలని అమిత్ షా సూచించారు.ఈ సూచన మేరకు బీజేపీ నేతలు నెలల్లూరు జిల్లాలో పాదయాత్రలో పాల్గొన్నారు.


 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్