
ప్రస్తుతం అందరి ఇళ్లల్లో ఐరన్ తో తయారు చేసిన గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లో వాటి స్థానంలో ఫైబర్‌తో తయారు చేసిన సిలిండర్స్ ఉండవచ్చు. ఫైబర్ సిలిండర్స్ ఏంటి అనుకుంటున్నారా ? అవును.. ఇప్పుడు మార్కెట్‌లోకి కొత్త రకం సిలెండర్స్ వచ్చేశాయి. వీటిని ఇనుముతో కాకుండా ఫైబర్ తో తయారు చేశారు. వీటిని మొట్ట మొదటి సారిగా ఇండేన్ సంస్థ వీటిని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. మన వద్ద ఇప్పుడున్న సిలిండర్స్ కంటే వీటి పనితీరు మెరుగ్గా ఉండటం, వాడటం సులభం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతీ ఒక్కరి ఇంట్లో ఈ సిలిండర్సే ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
దీని ప్రత్యేకతలేంటి ?
ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఐరన్ సిలెండర్ బరువు అధికంగా ఉంటుంది. దీనిని తీసుకెళ్లడం చాలా కష్టం. మహిళలు అయితే తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కచ్చింతగా ఎవరో ఒకరు సాయం చేస్తే తప్పా.. అవి ఇంట్లోకి రాలేని పరిస్థితి. గ్యాస్ అయిపోయిన తరువాత ఉండే ఖాళీ గ్యాస్ సిలిండర్ కూడా బరువుగానే ఉంటుంది. వాటిని కూడా ఫిల్ చేయడానికి తీసుకెళ్లడమూ ఇబ్బందే. ఇప్పుడొచ్చిన ఫైబర్ సిలిండర్ ముందుగా ముందుగా ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఎందుకంటే చాలా తేలికగా ఉంటుంది. ఫుల్ గ్యాస్ తో ఉన్న సిలిండర్ ను తీసుకెళ్లడం సులభమే. దానిని ఫిల్ చేయించడం కూడా చాలా తేలిక. ఇప్పుడు మన ఇళ్లలో అందుబాటులో ఉన్న సిలిండర్ బరువు 16 కిలోలు ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన ఫైబర్ సిలిండర్ బరువు 6.3 కిలోలు ఉంటుంది. కాబట్టి దీనిని తరచూ మార్చడం సులభం.
బంగారం దుకాణంలో చోరీకి యత్నం.. వెంబడించి మరీ..!
ఇప్పుడు ఉన్న ఐరన్ సిలెండర్లలో మనకు గ్యాస్ ఎంత ఉందనేది తెలుసుకోవడం చాలా కష్టం. కొన్ని సార్లు మంట అయిపోయేంత వరకు మనకు గ్యాస్ అయిపోయిందనే విషయం తెలియదు. అయితే ఈ ఫైబర్ సిలిండర్ లో మనకు గ్యాస్ ఎంత ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ సిలిండర్లలో గ్యాస్ ఏ స్థాయిలో ఉందనే విషయం స్పష్టంగా చూసే ఏర్పాట్లు చేశారు. దాని కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అలాగే కొన్ని సందర్భాల్లో మంటలు వ్యాపించినప్పుడు లేదా గ్యాస్ లీక్ అయినప్పుడు ఇప్పుడున్న ఐరన్ సిలిండర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఫైబర్ సిలిండర్ పేలదు. దీంతో చాలా వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరకుండా ఉంటుంది. సేఫ్టీ విషయంలో చాలా ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు.
ఐరన్ సిలిండర్లు బరువుగా ఉండటం వల్ల దాదాపు మనం సిలిండర్ ఒక సారి పెట్టిన చోటే అందులో గ్యాస్ అయిపోయేంత వరకు ఉంచుతాం. దీని వల్ల గచ్చుపై మరకలు ఏర్పడతాయి. వాటిని తొలగించడం చాలా కష్టం. ఈ ఫైబర్ సిలిండర్ల వల్ల గచ్చుకు మరకలు అంటుకునే ప్రమాదం ఉండదు. ఐరన్ సిలిండర్లు తప్పు పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఫైబర్ సిలిండర్లు తుప్పు పట్టవు. ఇలా యూజర్ ఫ్రెండ్లీ గా ఈ ఫైబర్ సిలిండర్లను రూపొందించారు. దీనిని కూడా ఇప్పుడు తీసుకుంటున్నట్టుగానే సబ్సిడీ కింద తీసుకోవచ్చు. అయితే ఇందులో 5 కేజీ, 10 కేజీ అనే రెండు రకాల సిలిండర్స్ ఉన్నాయని ఇండేన్ గ్యాస్ సంస్థ తెలిపింది.