ఫ్లైట్ కార్గోలో కన్నంటుకుంది.. అబుదాబిలో లేచాడు.. ఇండిగో విమానంలో విచిత్రఘటన..

By SumaBala BukkaFirst Published Dec 15, 2021, 10:27 AM IST
Highlights

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన  ఓ లోడర్ Mumbai-Abu Dhabi విమానంలోని కార్గో కంపార్ట్‌మెంట్‌లో నిద్రపోయాడు, ఆ విమానం అలా ప్రయాణించి.. యుఎఇ రాజధాని నగరానికి చేరిన తరువాత ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది.. పరీక్షించగా అతను సురక్షితంగా ఉన్నట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డిజిసిఎ అధికారులు ఈ రోజు తెలిపారు.

న్యూఢిల్లీ : IndiGo Airlines విమానంలో ఓ విచిత్ర ఘటన జరిగింది.Luggage Compartmentలోకి సామాన్లు ఎక్కించే ఓ వ్యక్తి ఇంకా విమానం బయలుదేరడానికి సమయం ఉండడంతో.. కాసేపు అందులోనే నిద్రపోయాడు. ఆ విషయం తెలియని విమాన సిబ్బంది కార్గో కంపార్ట్ మెంట్ తలుపులు మూసేశారు. విమానం కదలికలకు మెలుకువ వచ్చిన వ్యక్తి దిగుదామని చూస్తే ఆల్రెడీ విమానం టేకాఫ్ అయ్యింది. 

ఈ ఘటన ముంబై ఎయిర్ పోర్టులో జరిగింది. వివరాల్లోకి వెడితే.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన  ఓ లోడర్ Mumbai-Abu Dhabi విమానంలోని కార్గో కంపార్ట్‌మెంట్‌లో నిద్రపోయాడు, ఆ విమానం అలా ప్రయాణించి.. యుఎఇ రాజధాని నగరానికి చేరిన తరువాత ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది.. పరీక్షించగా అతను సురక్షితంగా ఉన్నట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డిజిసిఎ అధికారులు ఈ రోజు తెలిపారు.

విమానంలో సామాను లోడ్ చేసిన తర్వాత, ప్రైవేట్ క్యారియర్‌లోని  Bag Loaderలలో ఒకరు ఆదివారం విమానంలోని కార్గో కంపార్ట్‌మెంట్‌లోని బ్యాగేజీ వెనుక నిద్రపోయారని వారు తెలిపారు. ఇలాంటి చర్య చట్ట విరుద్ధం. ముంబై విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్‌ కాగానే కార్గో డోర్‌ మూసుకుపోయి లోడర్‌ మేల్కొన్నట్లు అధికారులు తెలిపారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబిలో విమానం ల్యాండ్ అయిన తర్వాత, అబుదాబి అధికారులు లోడర్‌ను గుర్తించి, అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అతని భౌతిక పరిస్థితి నిలకడగా, సాధారణంగా ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు.

ఆ తరువాత ఆ లోడర్ ను తిరిగి ముంబై తీసుకురావడానికి అబుదాబిలోని అధికారుల నుండి అవసరమైన అనుమతులు పొందిన తరువాత, అతన్ని అదే విమానంలో ప్రయాణీకుడిగా తిరిగి ముంబైకి పంపినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) అధికారులు తెలిపారు.

ప్రణాళిక ప్ర‌కార‌మే రైతుల‌పైకి కారెక్కించారు.. ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌లో సిట్

అయితే ఇలాంటి చర్యలు ప్రమాదాలకు దారి తీస్తాయి. పొరపాటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిదే. అందుకే ఈ ఘటనలో ప్రమేయం ఉన్న విమానయాన సంస్థ సిబ్బంది మీద విచారణ జరుపుతున్నారు.

ఈ విషయం గురించి అడిగినప్పుడు, ఇండిగో ప్రతినిధి వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడుతూ, "సంఘటన గురించి మాకు తెలుసు, అవసరమైన అధికారులకు సమాచారం అందించబడింది. విషయం దర్యాప్తులో ఉంది." అని చెప్పుకొచ్చారు. 

click me!