సింహాలకు అక్బర్, సీత పేర్లు.. ఫారెస్ట్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు.. అసలేం జరిగిందంటే ?

By Sairam Indur  |  First Published Feb 27, 2024, 11:08 AM IST

మగ సింహానికి అక్బర్, ఆడ సింహానికి సీత అని పేర్లు పెట్టిన ఫారెస్ట్ అధికారిపై త్రిపుర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.  త్రిపుర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రబిన్ లాల్ అగర్వాల్ ను విధుల నుంచి తప్పించింది.


పశ్చిమ బెంగాల్ లోని శిలిగుడి సఫారీ పార్క్ లో ఉన్న అక్బర్, సీత అనే పేర్లు గల మగ, ఆడ సింహాలను ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచడం దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై కలకత్తా హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వివాదానికి కారణమైన ఫారెస్ట్ అధికారిపై త్రిపుర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

కల్యాణ్ కు క్యాష్ ట్రాన్సఫర్ అయినా.. బాబు కు కాస్ట్ ఓట్స్ ట్రాన్సఫర్ కావు - అంబటి

Latest Videos

వాస్తవానికి శిలుగుడి సఫారీ పార్క్ లోకి ఆ సింహాలను తీసుకురావడానికి ముందే వాటికి త్రిపురలో పేర్లు పెట్టారని పశ్చిమ బెంగాల్ ఫారెస్ట్ అధికారులు కోర్టుకు వెల్లడించారు. షేక్ స్పియర్ రోమియో జూలియట్ స్ఫూర్తితో త్రిపుర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్ అండ్ ఎకో టూరిజం) ప్రబిన్ లాల్ అగర్వాల్ ఆ సింహాలకు 'సీత', 'అక్బర్' అని పేరు పెట్టారు. ఆ సమయంలో ఇది ఇంత పెద్ద వివాదమవుతుందని ఆయనకు తెలియదు. 

వాటిని త్రిపుర నుంచి సఫారీ పార్క్ లోకి తీసుకురావడం, వాటిని ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచిన తరువాతే ఈ వివాదం తెరపైకి వచ్చింది. సీత అనే పేరున్న ఆడ సింహాన్ని, అక్బర్ అనే పేరు గల మగసింహాన్ని ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పశ్చిమ బెంగాల్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, ఫారెస్ట్ అధికారులకు మొట్టి కాయలు వేసింది.

హిందూ విద్యార్థి టీసీలో ‘ముస్లిం’ అని రాసిన టీచర్లు.. బలవంతంగా నమాజ్.. మత మార్పిడికి ప్రయత్నం.

వెంటనే ఆ సింహాల పేర్లు మార్చాలని ఆదేశించింది. దీనికి స్పందించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. ఆ సింహాల పేర్లు మార్చే ఆలోచన తమకూ ఉందని, కానీ వాటిని తమ రాష్ట్రానికి తీసుకురాక ముందే త్రిపురలో వాటికి నామకరణం జరిగిందని వెల్లడించింది. ఇది ఇలా పెద్ద వివాదం కావడంతో త్రిపుర ప్రభుత్వం దీనిపై దర్యాప్తు జరిపింది. ఆ సింహాలకు నామకరణం చేసిన త్రిపుర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రబిన్ లాల్ అగర్వాల్ ను సస్పెండ్ చేసింది.

click me!