పేటీఎంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభావం చూపుతున్నాయి.
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ సంస్థలో పనిచేస్తున్న 35 ఏళ్ల ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని పీటీఐ సంస్థ నివేదించింది. ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందనే భావనతో ఇండోర్ కు చెందిన ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ నివేదిక వెల్లడించింది.
పేటీఎంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉద్యోగాన్ని కోల్పోతామనే ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నారనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని సీఐ తారేష్ కుమార్ సోని తెలిపారని ఆ వార్తా సంస్థ తెలిపింది.
ఆదివారం నాడు తన ఇంట్లో గుప్తా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. అయితే సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లేదని పోలీసులు ప్రకటించారు.ఈ ఏడాది మార్చి 15 నుండి కస్టమర్ల నుండి డిపాజిట్లు, క్రెడిట్లను స్వీకరించవద్దని పేటీఎం పై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది.ఈ విషయమై పేటీఎం సంస్థ ఆర్‌బీఐ అధికారులతో సంప్రదింపులు జరుపుతుంది.
బ్యాంక్ రెగ్యులేటర్ తమ ఖాతాలను మార్చి 15 లోపుగా ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని పేటీఎం పేమెంట్స్ ను బ్యాంకు కస్టమర్లతో పాటు వ్యాపారులను కోరిన విషయం తెలిసిందే.అంతకుముందు ఫిబ్రవరి 29వ తేదీ వరక కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐ 15 రోజులపాటు గడువును పొడిగించింది.
రిజర్వ్ బ్యాంక్ నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కి యూపీఐ హ్యాండిల్ ను ఉపయోగించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లను ఇతర బ్యాంకులను తరలించే అవకాశాన్ని పరిశీలించాలని శుక్రవారం నాడు సూచించింది.పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం నివేదిక మేరకు పేటీఎం కు 30 కోట్ల వాలెట్లు, మూడు కోట్ల బ్యాంక్ కస్టమర్లున్నారు.