
న్యూఢిల్లీ: నాగాల్యాండ్‌లో ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. పొలిటికల్ క్యాంపెయిన్లు జోరుగా సాగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం ఫుల్ స్వింగ్‌లో ఉన్నది. ఈ తరుణంలో రాష్ట్ర మంత్రి తెంజెన్ ఇమ్నా అలాంగ్ మరో ట్వీట్ వదిలారు. ఆయన ట్వీట్లు తరచూ నెటిజన్లు అలరిస్తూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఎన్నికల క్యాంపెయిన్ గురించి ఓ ఫన్నీ ట్వీట్ చేశారు.
ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా అలాంగ్ ఓ చోట మీల్ తీసుకుంటూ ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఆ ఫొటోకు ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మంచిది.. ఈ ఎన్నికల పేరు చెప్పుకోవడం బాగుంది అంటూ అతను క్యాప్షన్ పెట్టాడు. ఆ ఫొటోలో ఎదురుగా ఆహారం ఉన్నది. మంత్రి అలాంగ్ ఆరగిస్తూ ఉన్నాడు. ఎన్నికల పేరుతో తిరుగుతూ ఫుల్‌గా భోజనం చేయడం బాగుంది అనే అర్థం వచ్చేలా హాస్యభరితంగా అతను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ అయింది.
Also Read: ‘ఆమె కోసం ఇంకా ఎదురుచూస్తున్నా..’.. మంత్రి కామెంట్.. షాదీ డాట్ కామ్ ఫౌండర్ ఫన్నీ రియాక్షన్ ఇదే
గతంలోనూ మంత్రి అలాంగ్ ట్వీట్లు వైరల్ అయ్యాయి.