నా భార్య కోపంగా ఉంది.. ఆమెను బుజ్జగించేందుకు సెలవులివ్వండి - ఏఎస్పీకి కానిస్టేబుల్ లేఖ.. సోషల్ మీడియాలో వైరల్

By team teluguFirst Published Jan 10, 2023, 1:21 PM IST
Highlights

వివాహం అయిన నాటి నుంచి భార్యతో ఉండకుండా వేరే చోట విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆవేదనతో ఏఎస్పీకి లేఖ రాశారు. తన భార్య తనపై కోపంగా ఉందని, ఆమెను బుజ్జగించేందుకు సెలవులు కావాలని అందులో పేర్కొన్నారు. 

ఓ కానిస్టేబుల్ సెలవుల కోసం ఏఎస్పీకి రాసిన లేఖ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. భార్య తనపై కోపంగా ఉందని, కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదని అందులో కానిస్టేబుల్ అభ్యర్థించాడు. ఆయన అభ్యర్థనకు కరిగిపోయిన ఏఎస్పీ సెలవులు మంజూరు చేశాడు. 

జోషిమఠ్ సంక్షోభం మధ్య ఉత్తరాఖండ్‌లోని కర్ణప్రయాగ్‌లోనూ ఇళ్లపై పగుళ్లు.. !

ఈ వింత లీవ్ లెటర్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని మౌ జిల్లాకు చెందిన గౌరవ్ చౌదరి గత నెలలో వివాహం చేసుకున్నాడు. అయితే అప్పటి నుంచి ఆయన మహరాజ్‌గంజ్ జిల్లాలోని నౌతన్వా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఇండో-నేపాల్ సరిహద్దులోని పీఆర్బీలో విధులు కేటాయించారు. 

బెంగళూరులో కూలిన నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్.. చిన్నారితో సహా తల్లి మృతి..!

పెళ్లయిన దగ్గర నుంచి ఆ కానిస్టేబుల్ తన భార్యకు దూరంగానే ఉన్నారు. అతడు ఇంటికి రాకపోవడంతో భార్య కోపంగా ఉంది. దీంతో సెలవులు కావాలని కోరుతూ ఆయన అసిస్టెంట్ సూపరింటెండెంట్ (ఏఎస్పీ)కి లేఖ రాశాడు. అందులో తన పరిస్థితిని మొత్తం వివరించాడు. తాను ఇంటికి వెళ్లకపోవడంత తనపై భార్య కోపంగా ఉందని, మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ఆమెకు ఎన్నో సార్లు కాల్ చేశానని కానీ ఆమె కట్ చేస్తోందని తెలిపారు. కాల్ లిఫ్ట్ చేసిన తన తల్లికి ఫోన్ ఇస్తోందని చెప్పారు. 

మంచి మనస్సు చాటుకున్న అక్షయ్ కుమార్.. ఢిల్లీ యువతి హార్ట్ సర్జరీ కోసం రూ.15 లక్షలు విరాళం

ఆమెను బుజ్జగించాలంటే సెలవులు అవసరం అని తెలిపారు. తన మేనల్లుడి పుట్టినరోజుకు ఇంటికి వస్తానని భార్యకు మాట ఇచ్చానని గౌరవ్ లేఖలో ప్రస్తావించారు. వారం రోజుల పాటు సెలవులు కావాలని కోరారు. అయితే ఈ లేఖకు ఏఎస్పీ చదివి, స్పందించారు. జనవరి 10 నుంచి కానిస్టేబుల్‌ గౌరవ్కు ఐదు రోజుల సాధారణ సెలవును ఆమోదించారు. 

ఇండోనేషియాలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత నమోదు..

విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని వారి అవసరాలకు అనుగుణంగా సెలవులు మంజూరు చేస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. సెలవుల వల్ల ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. 

click me!