ముజఫర్‌పూర్ రేప్: బ్రిజేష్ ఠాకూర్‌ కాల్ లిస్టులో మంత్రితో పాటు 40 మంది పేర్లు

By narsimha lodeFirst Published Aug 12, 2018, 1:43 PM IST
Highlights

: బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ అత్యాచార ఘటనలో  ప్రధాన నిందితుడు  బ్రిజేష్ ఠాకూర్  ప్రముఖులతో  సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.  బ్రిజేష్ ఠాకూర్  కాల్ లిస్టులో ఓ మంత్రి నెంబర్ కూడ ఉండటాన్ని పోలీసులు తమ దర్యాప్తులో  గుర్తించారు.


పాట్నా: బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ అత్యాచార ఘటనలో  ప్రధాన నిందితుడు  బ్రిజేష్ ఠాకూర్  ప్రముఖులతో  సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.  బ్రిజేష్ ఠాకూర్  కాల్ లిస్టులో ఓ మంత్రి నెంబర్ కూడ ఉండటాన్ని పోలీసులు తమ దర్యాప్తులో  గుర్తించారు.

ముజఫర్‌పూర్ అత్యాచార ఘటనలో కీలక నిందితుడు బ్రిజేష్ ఠాకూర్  కాల్ లిస్ట్ నుండి సేకరించిన ఫోన్ నెంబర్లకు సంబంధించి సుమారు రెండు పేజీల లిఖిత పూర్వకంగా వివరణ తీసుకొన్నట్టు చెప్పారు.. అయితే  ఈ ఘటనపై  పూర్తి విచారణలను ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందిన 34 మంది బాలికలు అత్యాచారాలకు గురైన విషయం తెలిసిందే. ఈకేసులో ప్రధాన నిందితుడు బ్రజేష్‌ ఠాకుర్‌ నివాసంలో సీబీఐ అధికారులు శనివారం 11 గంటలసేపు విస్తృత సోదాలు నిర్వహించారు. 

ఫోరెన్సిక్‌ నిపుణుల సాయాన్నీ తీసుకుని వివిధ పత్రాలను పరిశీలించారు. ఠాకుర్‌ సన్నిహితులనూ ప్రశ్నించారు. బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో శరణాలయంతో పాటు ప్రాతః కమల్‌ హిందీ దినపత్రికనూ నిందితుడు ఒకే భవనంలో నిర్వహిస్తున్నాడు. 

 ఠాకుర్‌ తనయుడు రాహుల్‌ ఆనంద్‌ పేరుతో హిందీ పత్రిక ఉండడంతో ఆయన్నీ ప్రశ్నించారు. ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో తమ కస్టడీలోకి తీసుకున్నారు. 

click me!