విషమంగానే ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసిన మేదాంత హాస్పిట‌ల్

By team teluguFirst Published Oct 7, 2022, 4:17 PM IST
Highlights

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మూలాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు. ఇప్పటికీ ఆయన ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. 

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయ‌న ఇప్ప‌టికీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. ఈ మేర‌కు ఆయ‌న హెల్త్ కండీష‌న్ వివ‌రిస్తూ గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిట‌ల్ శుక్ర‌వారం బులిటెన్ ను విడుద‌ల చేసింది.  ఆయ‌న‌ ప్రాణాలను రక్షించేందుకు మందులు ఇస్తున్నట్లు అందులో పేర్కొంది.

విషాదం.. టీ-90 ట్యాంకు పేలి ఇద్దరు ఇండియ‌న్ ఆర్మీ సిబ్బంది మృతి..మ‌రొక‌రికి గాయాలు

‘‘ ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఆయ‌న ప్రాణాలను రక్షించే మందులను వాడుతున్నారు. గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లోని ఐసీయూలో సమగ్ర నిపుణుల బృందం ఆయ‌న‌కు చికిత్స అందిస్తోంది ’’ అని ఆ హాస్పిటల్ ప్రకటనలో పేర్కొంది.

‘హిందూ దేవుళ్లను పూజించను’.. బౌద్ధ కార్యక్రమంలో ఆప్ మంత్రి ప్రతిజ్ఞ.. వివాదం రేపిన వీడియో

82 ఏళ్ల సమాజ్ వాదీ పార్టీ కురవృద్ధుడు ఆగస్టు 22 నుంచి రెగ్యులర్ మెడికల్ చెకప్స్ పొందుతున్నాడు. అయితే గ‌త‌ ఆదివారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఆయ‌న ఆస్పత్రిలో చేరారు. కాగా.. బుధవారం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ములాయం సింగ్‌ ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు గురుగ్రామ్‌ ఆస్పత్రికి వెళ్లారు.

పూణెలో రోడ్డు ప్ర‌మాదం.. భక్తులతో వెళ్తున్న ట్రక్ బోల్తా పడి 13 మందికి గాయాలు

హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశిస్తున్నానని, దాని కోసం ప్రార్థన చేస్తున్నానని తెలిపారు. ‘‘ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ యోగక్షేమాలను తెలుసుకోవడానికి గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో అఖిలేష్ యాదవ్ ను ఈ రోజు కలిశాను. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ’’ అని  మనోహర్‌లాల్‌ ఖట్టర్ హిందీలో ట్వీట్ చేశారు. 
 

click me!