భారత్ దెబ్బకు పాక్ ఎకానమీ కుదేలు... మూడీస్ ఆసక్తికర నివేదిక

Published : May 05, 2025, 03:39 PM IST
భారత్ దెబ్బకు పాక్ ఎకానమీ కుదేలు... మూడీస్ ఆసక్తికర నివేదిక

సారాంశం

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి మూడీస్ హెచ్చరించింది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి, ఆర్థిక సంస్కరణల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

భారత్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పాకిస్తాన్‌ను హెచ్చరించింది. పాకిస్తాన్‌కు బయటినుండి ఆర్థిక సహాయం అందడంలో ఇబ్బందులు తలెత్తవచ్చని తెలిపారు. దీనివల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోవచ్చని తెలిపారు. ఇది పాకిస్తాన్ చెల్లించాల్సిన రుణ చెల్లింపులకు అవసరమైన కనీస స్థాయి కంటే చాలా తక్కువని మూడీస్ పేర్కొంది. 

పాకిస్తాన్‌కు విదేశీ రుణాలు రావడం కష్టం

మే 5న విడుదల చేసిన నివేదికలో భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల వల్ల పాకిస్తాన్ ఆర్థిక సంస్కరణల ప్రక్రియకు గట్టి దెబ్బ తగలవచ్చని మూడీస్ హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే IMFతో జరుగుతున్న సంస్కరణలపై ప్రభావం పడుతుంది, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం పడుతుంది, విదేశీ రుణాలు చెల్లించే సామర్థ్యం, ఆర్థిక సహాయం పొందే అవకాశాలు తగ్గుతాయి.

భారత్‌పై పెద్దగా ప్రభావం ఉండదు

పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండదని మూడీస్ నివేదిక పేర్కొంది. ఎందుకంటే భారత్‌కు పాకిస్తాన్‌తో వాణిజ్యం చాలా తక్కువ. అయితే ఉద్రిక్తతలు పెరిగితే రక్షణ వ్యయం పెరగవచ్చు, ఇది భారత ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల భారత ద్రవ్యలోటు తగ్గించే ప్రక్రియ మందగించవచ్చు.

ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు

భారత్, పాకిస్తాన్ మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి సైనిక ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, పెద్ద ఎత్తున యుద్ధం జరిగే అవకాశం తక్కువ అని మూడీస్ నివేదిక పేర్కొంది. అయితే  తరచుగా ఉద్రిక్తతలు పెరగడం వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు ఏర్పడుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం