కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం: 50 మంది శాంపిల్స్ ల్యాబ్ కు తరలింపు

By narsimha lodeFirst Published Jan 23, 2022, 1:07 PM IST
Highlights


కర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్ మళ్లీ వ్యాప్తి చెందుతుంది. ఓ మహిళకు మంకీ ఫీవర్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. మరో వైపు ఇవే వ్యాధి లక్షణాలున్న 50 మంది శాంపిల్స్ ను కూడా ల్యాబ్ కు పంపారు.

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని Shiva mogga జిల్లాలో మంకీ ఫీవర్ మళ్లీ వ్యాప్తి చెందుతుంది. గతంలో కూడా ఇదే జిల్లాలో మంకీ ఫీవర్  వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే.

శివ మొగ్గ జిల్లాలోని తీర్ధహళ్లిలోని కండిగే గ్రామంలో 57 ఏళ్ల మహిళకు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (మంకీ ఫీవర్) ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. 2019లో Monkey fever కేసు నమోదైంది.

కండిగె గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో నివసించే మహిళ అటవీ ప్రాంతంలో నివసిస్తుంది. ఆమెకు జ్వరం రావడంతో ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో ఆమె శాంపిల్ ను తీసుకొన్నారు  వైద్యులు.  ఆమె శాంపిల్స్ ను పరీక్షకు పంపారు. ఈ శాంపిల్స్ లో ఆమెకు మంకీ ఫీవర్ ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు.

శుక్రవారం నాడు సాయంత్రం బాధిత మహిళను Manipal ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.  బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని శివమొగ్గ జిల్లా  ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజేష్ ఎస్. ఉరగి హళ్లి చెప్పారు. మరో వైపు మంకీ ఫీవర్ లక్షణాలున్నాయనే అనుమానంతో 50 మంది శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు.

2019 డిసెంబర్ లో అర్ధగోడులో మంకీ ఫీవర్ వెలుగ చూసింది. రెండేళ్లలో శివమొగ్గలో మొత్తం 26 మంది చనిపోయారు. 1957లో సొరబ తాలుకాలోని క్యాసనూరు గ్రామంలో మంకీ ఫీవర్ వెలుగు చూసిందని వైద్య శాఖాధికారులు గుర్తు చేస్తున్నారు. అప్పటి నుండి వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వైద్యులు చర్యలు తీసుకొంటున్నారు. 

తొలుత ఈ వైరస్ ను చనిపోయిన కోతి రక్తంలో వైద్యులు గుర్తించారు.ఈ వ్యాధి దేశంలోని కేరళ,కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో గతంలో నమోదైనట్టుగా వైద్య శాఖాధికారుల రికార్డులు చెబుతున్నాయి. 1957 నుండి దేశంలో ప్రతి ఏటా 400 నుండి 500 వరకు మంకీ ఫీవర్ కేసులు నమోదౌతున్నాయి.

అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. అతిసారం, వాంతులు, చిగుళ్లు, ముక్కు నుండి రక్తస్రావం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.మంకీ ఫీవర్ కు సరైన చికిత్స లేనందున  4 నుండి 15 శాతం మరణాలు సంబవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పుల వల్లే మంకీ ఫీవర్ వ్యాప్తి చెందుతుందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.

click me!