జర్నలిస్ట్ రానా అయ్యూబ్‌పై మనీలాండరింగ్ అభియోగాలు.. చీటింగ్ కేసు కూడా న‌మోదు చేసిన ఈడీ

Published : Oct 13, 2022, 02:14 PM IST
జర్నలిస్ట్ రానా అయ్యూబ్‌పై మనీలాండరింగ్ అభియోగాలు.. చీటింగ్ కేసు కూడా న‌మోదు చేసిన ఈడీ

సారాంశం

జర్నలిస్టు రాణా అయ్యూబ్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్, చీటింగ్ కేసు నమోదు చేసింది. గతంలో ఆమె స్వచ్చంధ సేవా సంస్థ ద్వారా సేకరించిన డబ్బులను వ్యక్తిగతంగా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

జర్నలిస్టు రాణా అయ్యూబ్‌పై  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం మనీలాండరింగ్ అభియోగాలు నమోదు చేసింది. దీంతో పాటు ఆమెపై చీటింగ్ కేసులు కూడా నమోదు చేసింది. కెట్టో.కామ్ (Ketto.com) వెబ్‌సైట్ ద్వారా సహాయం, దాతృత్వం పేరుతో సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆమెపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ ఫిబ్రవరిలో రూ. 1.77 కోట్లను అటాచ్ చేసింది.

బంగారం అక్ర‌మ ర‌వాణాకు అడ్డాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌.. రెండు రోజుల్లో 15 కిలోల బంగారం పట్టివేత..

అయ్యూబ్ నిధులను దుర్వినియోగం చేశారని, వ్యక్తిగత ఖర్చుల కోసం నిధుల‌ను మరో ఖాతాలోకి మళ్లించారని ఈడీ అధికారి ఒకరు తెలిపారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.  ప్రస్తుతం గ్లోబల్ మీడియా హౌస్ కు ఆర్టిక‌ల్స్ రాసే రాణా అయ్యూబ్.. కోవిడ్ -19 సాయం సాకుతో ప్రజలను మోసం చేసి, దాతృత్వానికి ఉద్దేశించిన నిధులను ఆమె వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేశాడని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. 

పురుషులు మనస్సులను దృఢపర్చుకోవాలి.. మహిళలను హిజాబ్ నుండి విముక్తి చేయాలి : హర్యానా మంత్రి అనిల్ విజ్

ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వంపై త‌నపై వ‌చ్చిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలను రాణా అయ్యూబ్ ఖండించారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందుకే ఈడీ ఈ విధమైన ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఈడీ ద‌ర్యాప్తును ‘‘మంత్రగత్తె వేట’’ అంటూ అభివర్ణించారు. కాగా అయ్యూబ్ పలు సందర్భాల్లో కేంద్రం ప్రభుత్వంపై చురుకుగా విమర్శలు చేస్తుంటారు.

ఆమెపై న‌మోదైన ఫిర్యాదు ప్ర‌కారం.. అయ్యూబ్ నాన్-ప్రాఫిట్ క్యాంపెయిన్ ద్వారా సేకరించిన 50 లక్షల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) తెరిచారు. వాటిని సేవింగ్స్ ఖాతా నుంచి ఎఫ్‌డీలోకి మళ్లించారు.  అయితే ఆగస్ట్ 2021లో వికాస్ సాంకృత్యాయన్ అనే ఓ వ్య‌క్తి అయ్యూబ్‌పై ఫిర్యాదు చేశారు. అందులో దాతృత్వం పేరుతో సాధారణ ప్రజలను అయ్యూబ్ మోసం చేసింది అని ఆరోపించారు. 

‘ముస్లింల బ్యూటీ పార్లర్ల‌కు, మెహందీ కేంద్రాలకు వెళ్లొద్దు’

అత‌డి ఫిర్యాదు ఆధారంగా  2021న సెప్టెంబర్ 7వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో అయ్యూబ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆమెపై భారత శిక్షాస్మృతి (IPC)లోని 403, 406, 418, 420 సెక్షన్‌ల కింద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66D సెక్షన్ నమోదు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం