rahul gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పలు దేశాలతో పాటు భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. విదేశీ ప్రయాణికుల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. దీనికి తోడు కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు త్వరలో జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో రాహుల్ విదేశీ పర్యటన కాంగ్రెస్ లో కలవరానికి దారితీసింది.
rahul gandhi: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నిలు ఎలాగైన జరిపితీరుతామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడం తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా రాహుల్ విదేశీ పర్యటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ ఆయన విదేశాలకు వెళ్లడం బాధ్యతారాహిత్యమంటూ విమర్శించింది. బీజేపీ ధీటుగా కాంగ్రెస్ సైతం స్పందిస్తోంది. బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్.. ‘రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లారు. బీజేపీ, ఆ పార్టీ మద్దతుదారులు ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు’’ అని ఏఐసీసీ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు. ఇదిలావుండగా, త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంతర్గత కలహాలు, ఇతర సమస్యలతో సతమత మవుతోంది.
Also Read: Omicron: మహారాష్ట్రలో ఒక్కరోజే 198 ఒమిక్రాన్ కేసులు.. రాష్ట్ర మంత్రిని వదలని మహమ్మారి !
undefined
త్వరలో జరగబోయే ఎన్నికలు, కాంగ్రెస్ అంతర్గత సమస్యల వంటి పరిస్థితులు ఉన్న సమయంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొన్నది తెలుస్తున్నది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి హాజరైన మరుసటి రోజు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 3న మోగాలో జరిగే ర్యాలీలో ప్రసంగించడం ద్వారా పంజాబ్‌లో రాబోయే ఎన్నికలకు రాహుల్ గాంధీ పార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తారని కాంగ్రెస్ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత.. రాహుల్ గాంధీ విదేశీ పర్యటకు వెళ్లాడని తెలిసి ఈ ర్యాలీ వాయిదా పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే, జనవరి 15, 16 తేదీల్లో పంజాబ్ గోవా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని.. రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read: Omicron: మళ్లీ మహమ్మారి విజృంభణ.. ఒక్కవారంలోనే 50 లక్షలకు పైగా కొత్త కేసులు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులు, వర్గపోరుతో సతమతమవుతున్న తరుణంలో రాహుల్ విదేశీ పర్యటన కాంగ్రెస్ పంజాబ్ యూనిట్‌లో కలవరానికి దారితీసింది. మోగా ర్యాలీ తమ ఐక్యతను చాటే విధంగా ఉంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. పార్టీ ఏర్పాట్లను ప్రారంభించిందనీ, వేదికను ఖరారు చేసినట్లు తెలిపారు. “అయితే, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లాడని కూడా మాకు తెలియదు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాతే మాకు దాని గురించి తెలిసింది. దీనిన సుర్జేవాలా సమర్థించారు”అని వెల్లడించారు. రాహుల్ విదేశీ పర్యటన కారణంగా “ఇప్పుడు మోగా ర్యాలీ వాయిదా పడింది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ , పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఇతర నేతలను రాహుల్ ఒకే వేదికపైకి తీసుకురాగలరని, పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించే భిన్న స్వరాలు ఆగిపోతాయని మేము ఆశించాం. అలాగే, ఆయన (రాహుల్) లేకపోవడం వల్ల టిక్కెట్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోంది' అని ఆయన అన్నారు. ఇలా కాంగ్రెస్ నేతల్లోనూ రాహుల్ ప్రస్తుత సమయంలో విదేశాలకు వెల్లడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Chennai Rains: చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం