చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి: 2000లో మోడీ ఏం చెప్పారంటే?

చట్ట సభల్లో మహిళలు ఎక్కువగా ఉండాలనే  నరేంద్ర మోడీ కోరుకుంటున్నారు.2000 ఏప్రిల్ మాసంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ విషయమై  మోడీ సానుకూలంగా స్పందించారు.

Google News Follow Us

న్యూఢిల్లీ: చట్ట సభల్లో మహిళా సభ్యులు ఎక్కువగా ఉండాలని నరేంద్ర మోడీ కోరుకుంటున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్న కాలంలోనే  పార్లమెంట్ ఉభయ సభల్లో  మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందాయి. కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.ఈ బిల్లుకు  పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.

అయితే  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో  నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ కు అనుకూలంగా మాట్లాడారు. పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో మహిళా ప్రతినిధులు ఎక్కువగా ఉండాలనే డిమాండ్ ను  మోడీ సమర్ధించారు. ఈ దిశగా ఎన్నికల విధానాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు.  పంజాబ్ రాష్ట్రంలోని పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు  2000 ఏప్రిల్ మాసంలో  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో  మోడీ వెళ్లారు.ఆ సమయంలో మీడియాతో మాట్లాడారు.  చట్ట సభల్లో మహిళా ప్రతినిధుల సంఖ్య ఎక్కువగా ఉండే అంశానికి ఆయన మద్దతు ప్రకటించారు. 

 

అయితే ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత  పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది.విధాన రూపకల్పనలో మహిళలకు పెద్దపీట వేయడంలో నరేంద్ర మోడీ  సానుకూలంగా ఉంటారు.

Read more Articles on