
ఇప్పుడు 90 శాతం త్రివర్ణ పతాకాలు చైనా నుంచే వస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. గతంలో జెండాను ఖాదీతో తయారు చేసేవారని, కానీ ప్రస్తుతం చైనా నుంచి వస్తున్నాయని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజోయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇప్పుడు ఇది హర్ ఘర్ తిరంగ జెండా గురించి కాదు.. హర్ ఘర్ చైనా కా జెండా ’’ అని ఆయన అన్నారు. ఖాదీ కార్మికులతో త్రివర్ణ పతాకాలను తయారు చేయించాలని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని, కానీ ప్రధాని మోదీకి చైనాపై ప్రత్యేక ప్రేమ ఉందని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఇంకా తిరంగాను ఎగురవేయలేదని, కానీ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దానిని ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోందని అన్నారు.
మోదీకి భయపడే ప్రసక్తే లేదు.. నా పనిని నేను కొసాగిస్తాను: రాహుల్ గాంధీ
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో కేంద్రం ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజలు తమ ఇళ్ల వద్దే జాతీయ జెండాలను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. అయితే తాము సంవత్సరాల తరబడి జెండాను ఎగురవేస్తున్నామని, ఈ ప్రచారాన్ని ఇప్పుడు నిర్వహించాల్సిన అవసరం లేదని చెబుతూ కాంగ్రెస్ ఈ చర్యను వ్యతిరేకించింది.
‘‘హర్ ఘర్ తిరంగ’’ ప్రచారాన్ని నిర్వహిస్తున్న వారు దేశ వ్యతిరేక సంస్థ నుంచి బయటకు వచ్చారని ఆర్‌ఎస్‌ఎస్‌ని ఉద్దేశించి మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మాట్లాడిన ఒక రోజు తర్వాత అజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా బుధవారం కర్ణాటక ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ప్రజలతో కూడా గాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ కర్ణాటక ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ సహోద్యోగులందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. 52 ఏళ్లుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని దేశ వ్యతిరేక సంస్థ నుంచి ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని నడుపుతున్న వారు బయటపడ్డారనేది చరిత్ర సాక్షిగా ఉంది. స్వాతంత్య్ర పోరాటం నుంచి వారు ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఆపలేకపోయారు. నేటికీ ఆపలేరు’’ అని ఆయన తెలిపారు.
ఇస్లామిక్ ఛాందసవాదులకు అస్సాం కేంద్రంగా మారుతోంది - సీఎం హిమంత బిశ్వ శర్మ
అయితే, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు తాము మద్దతు ప్రకటించామని, దీనిపై ఎలాంటి రాజకీయాలు చేయొద్దని ఆర్ఎస్ఎస్ రాహుల్ పై ఎదురుదాడికి దిగింది. ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యావత్ దేశం కోసం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా మరేదైనా సంస్థ నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలన్నింటికీ ఆరెస్సెస్ తన మద్దతును ప్రకటించింది. అందులో పాల్గొంటుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పై రాజకీయాలు ఉండకూడదు. వేడుకలపై దృష్టి సారించాలి ’’ అని ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్ అన్నారు.