‘మోడీ అక్కడ ఓ ఫంక్షన్ చేశారు’- రామమందిర ప్రతిష్ఠాపనపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

By Sairam Indur  |  First Published Jan 23, 2024, 7:29 PM IST

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట (ayodhya pran pratishtha celebrations) కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. అది బీజేపీ రాజకీయ కార్యక్రమం (BJP’s political programme) అని, ప్రధాన నరేంద్ర మోడీ అక్కడ ఓ ఫంక్షన్ (Narendra Modi did a function) చేశారని విమర్శించారు. 


అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యక్షంగా అయోధ్యకు వెళ్లలేనివారు టీవీలు, సోషల్ మీడియాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ వేడుక నేపథ్యంలో దేశంలోని ఆలయాలన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి. ప్రధాని పిలుపు మేరకు మరో సారి దీపావళి జరుపుకున్నారు. 

అయోధ్య రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరు.. ఇక నుంచి ఆ పేరుతోనే దర్శనం

Latest Videos

ఈ కార్యక్రమం జరిగిన మరుసటి రోజు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టపై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ రాజకీయ కార్యక్రమం అని అన్నారని‘ది ప్రింట్’ నివేదించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తన భారత్ జోడో న్యాయ్ యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఇలాంటి చర్యలు యాత్రకు ప్రయోజనం చేకూరుస్తాయని అన్నారు. దీని వల్ల పబ్లిసిటీ లభిస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు.

అస్సాంలో న్యాయ్ యాత్ర ప్రధాన సమస్యగా మారిందని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రుల్లో హిమంత బిశ్వ శర్మ ఒకరని విమర్శించారు. తాను రాష్ట్రంలోకి వచ్చినప్పుడల్లా తనతో ప్రజలు సమస్యలు వెల్లడిస్తారని తెలిపారు. రాష్ట్రంలో భారీ నిరుద్యోగం, భారీ అవినీతి, భారీ ధరల పెరుగుదల ఉందని, రైతులు కష్టపడుతున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో ఏ యువతకు ఉద్యోగం లభించడం లేదని, ఇవే అంశాలు తాము లేవనెత్తుతున్నామని చెప్పారు. 

184 మంది మయన్మార్ సైనికులను స్వదేశానికి పంపిన ఇండియా.. ఎందుకంటే ?

భాగస్వామ్యం, యువత, కార్మికులు, మహిళలు, రైతులకు న్యాయం అనే ఐదు స్తంభాలతో ఈ యాత్ర దేశానికి బలాన్ని ఇస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వచ్చే నెలరోజుల్లో ఐదు స్తంభాల న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ తన బ్లూప్రింట్ ను ముందుకు తెస్తుందని ఆయన చెప్పారు.

ఇంటి నెంబర్ కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారులు

అయోధ్యలోని రామాలయంలో ప్రతిష్ఠాపన కార్యక్రమం గురించి, దేశంలో అది సృష్టించిన ప్రకంపనలను ఎలా ఎదుర్కొంటారని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. ‘‘ఇది బీజేపీ రాజకీయ కార్యక్రమం. నరేంద్ర మోడీ అక్కడ ఒక ఫంక్షన్, షో చేశారు. ఇది మంచిదే. దేశాన్ని బలోపేతం చేయడానికి ఐదుగురు న్యాయమూర్తులకు సంబంధించిన మా కార్యక్రమం గురించి మాకు స్పష్టత ఉంది’’ అని అన్నారు. 

click me!