డీఎంకే అధ్యక్ష పీఠం కోసం స్టాలిన్ నామినేషన్

By sivanagaprasad KodatiFirst Published Aug 26, 2018, 12:51 PM IST
Highlights

తమిళనాడులో డీఎంకే అధ్యక్ష పీఠం కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగష్టు 28న పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు స్టాలిన్ తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత అన్బళగన్‌ను కలుసుకున్నారు. అనంతరం దివంగత నేతలు అన్నాదురై, కరుణానిధిల స్మారక స్థలాన్ని సందర్శించారు.

చెన్నై: తమిళనాడులో డీఎంకే అధ్యక్ష పీఠం కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగష్టు 28న పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు స్టాలిన్ తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత అన్బళగన్‌ను కలుసుకున్నారు. అనంతరం దివంగత నేతలు అన్నాదురై, కరుణానిధిల స్మారక స్థలాన్ని సందర్శించారు.
 
డీఎంకే అధ్యక్షుడిగా దాదాపు 50 ఏళ్ల పాటు కొనసాగిన కరుణానిధి ఇటీవల మరణించడంతో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న స్టాలిన్‌‌ను గతంలోనే తన రాజకీయ వారసుడిగా కరుణానిధి ప్రకటించారు. కరుణానిధి మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష పదవికి తాను రేసులో ఉన్నానని కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి ప్రకటించారు. 

నిజమైన కార్యకర్తలంతా తనవైపే ఉన్నారని స్పష్టం చేశారు. దీంతో అధ్యక్ష పీఠం కోసం అన్నదమ్ముల మధ్య పోరు నడుస్తోంది. నువ్వా నేనా అన్న రీతిలో అన్నదమ్ములు పీఠం కోసం పావులు కదుపుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ 5న అళగిరి  బలప్రదర్శనకు దిగనున్నారు. లక్షలాదిమంది కార్యకర్తలతో చెన్నై మహానగరంలో శాంతి ర్యాలీ చేపట్టబోతున్నారు. కరుణానిధి ఉన్నప్పుడే డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన అళగిరి....ఇప్పుడు ఎలాగైనా తిరిగి పార్టీలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు. 

పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత అళగిరి గత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కరుణానిధి అనారోగ్యం పాలైన తర్వాత తండ్రిని చూసేందుకు తరచూ వచ్చేవారు. అప్పటికే స్టాలిన్ ను కరుణ తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు కూడా. ఇప్పటికే పార్టీపై గట్టిపట్టున్న స్టాలిన్ నూతన అధ్యక్షుడిగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.    

ఈ వార్తలు కూడా చదవండి

తమిళనాడులో అన్నదమ్ముల పోరు: అళగిరి వెనక బిజెపి?

డీఎంకేలో అన్నదమ్ముల సవాల్.....బలప్రదర్శనకు అన్న రెడీ

 

 

click me!