జీన్స్ ప్యాంట్ కోసం హత్యా..?

Published : Aug 25, 2018, 02:24 PM ISTUpdated : Sep 09, 2018, 01:04 PM IST
జీన్స్ ప్యాంట్ కోసం హత్యా..?

సారాంశం

కోపం కట్టలు తెంచుకోవటంతో విచక్షణ కోల్పోయిన అన్న రాజేంద్ర ఇంట్లో ఉన్న కత్తితో తమ్ముడిపై దాడి చేసాడు. అనంతరం రాజేంద్ర అక్కడి నుంచి పరారయ్యడు.

జీన్స్ ప్యాంట్ కోసం.. ఇద్దరు అన్నదమ్ముల మధ్య మొదలైన గొడవ.. ఒకరు ప్రాణం కోల్పోయేదాకా దారితీసింది. ఈ సంఘటన అలహాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రాజేంద్ర, సురేంద్ర అనే అన్నదమ్ములు ఉత్తరప్రదేశ్‌లోని బెల్హమ్‌పూర్ గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. తమ్ముడు సురేంద్ర ఇటీవల ఒక జీన్స్ ప్యాంట్ కొనుక్కున్నాడు. 

జీన్స్ ప్యాంట్ ఎవరు వేసుకోవాలని అంశంపై అన్నదమ్ముల మధ్య గొడవ మొదలైంది. ఇద్దరూ తీవ్రంగా వాదించుకోసాగారు. కోపం కట్టలు తెంచుకోవటంతో విచక్షణ కోల్పోయిన అన్న రాజేంద్ర ఇంట్లో ఉన్న కత్తితో తమ్ముడిపై దాడి చేసాడు. అనంతరం రాజేంద్ర అక్కడి నుంచి పరారయ్యడు. విషయం తెలుసుకున్న ఇరగుపొరుగు రక్తపుమడుగులో పడి ఉన్న సురేంద్రను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేంద్ర కోసం గాలిస్తున్నారు. నిందితుడు రాజేంద్రకు నేర చరిత్ర ఉంది. గతంలో ఒక నేరంపై జైలుపాలయ్యి కొద్ది రోజుల క్రితమే విడుదలయ్యాడు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?