మిజోరంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

* ఎంఎన్ఎఫ్ 16 స్థానాల్లో, కాంగ్రెస్ 11, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు

11:41 PM

8 స్థానాల్లో ఎంఎన్ఎఫ్ గెలుపు

మిజోరం ఎన్నికల ఫలితాల్లో ఎంఎన్ఎఫ్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 8 స్థానాల్లో విజయం సాధించింది.

6:37 PM

మిజోరాం సీఎం రాజీనామా

మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హవాలా తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించారు. తన సారథ్యంలోని పార్టీ ఓటమిపాలవడంతో బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.  ఈ పలితాలను తాను అస్సలు ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం వల్లే ఓడిపోయామని తన్హవాలా వెల్లడించారు.  
 
6:09 PM

మిజోరంలో బీజేపీతో పొత్తు ఉండదు.. ఎన్డీఏలో ఉంటాం: ఎంఎన్ఎఫ్

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి మిజో నేషనల్ ఫ్రంట్ పదేళ్ల తర్వాత అధికారాన్ని అందుకుంది. ఉదయం వెలువడిన ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను చేరుకుంది.

ఈ నేపథ్యంలో ఎంఎన్ఎఫ్ అధ్యక్షుడు జోరాంతంగ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీకి మూడు ప్రాధాన్యతలు ఉన్నాయని.. మద్య నిషేధం, రోడ్డ మరమ్మత్తులు, సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల అమలుపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.

అలాగే నూతన ప్రభుత్వంలో బీజేపీతో కానీ, మరో పార్టీతో కానీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. అయితే తాము ఈశాన్య ప్రజాస్వామిక కూటమి, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉంటామని జోరాంతంగ వెల్లడించారు. 

5:18 PM

కూలబడ్డ కాంగ్రెస్.. పుంజుకున్న ఎంఎన్ఎఫ్

ఈశాన్య భారతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం మిజోరంలో ఆ పార్టీ కోల్పోయింది. ఉదయం వెలువడిన ఫలితాల్లో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 26 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.. కాంగ్రెస్ 5 స్థానాల్లో, బీజపీ 1, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు.

2013 అసెంబ్లీ ఎన్నికల్లో 34 సీట్లు సాధించి అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ.. కేవలం 5 స్థానాలకే సరిపెట్టుకుని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

2013 ఎన్నికల్లో పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 2,55,917 ఓట్లు రాగా.. ఈసారి ఎన్నికల్లో 1,90,307 ఓట్లు వచ్చాయి. ఇక ఎంఎన్ఎఫ్‌కు 2013లో 1,64,000 ఓట్లు రాగా.. 2018లో 2,37,119కి పెరిగాయి. దీనిని బట్టి కాంగ్రెస్‌కు ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. 

1:15 PM

12 చోట్ల ఎంఎన్ఎఫ్, 7 చోట్ల ఇతరులు విజయం

మిజోరం ఎన్నికల ఫలితాల్లో ఎంఎన్ఎఫ్ దూసుకెళ్తోంది.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మిజో నేషనల్ ఫ్రంట్ 12 చోట్ల, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. 
 
12:20 AM

మిజోరం సీఎం ఓటమి

మిజోరం ఎన్నికల ఫలితాల్లో సంచలన ఫలితం వెలువడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తన్హావ్లా ఓటమి పాలయ్యారు.

చాంపై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం.. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి టీజే లాల్‌నుత్లుంగా చేతుల్లో 856 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మరో స్థానంలోనూ ఆయన ఓటమి పాలయ్యారు.

ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. ఎంఎన్ఎఫ్ అధికారం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఎంఎన్ఎఫ్ 29 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 
 
10:44 AM

లైవ్: మిజోరం ఎన్నికల ఫలితాలు

అధికారం దిశగా ఎంఎన్ఎఫ్ దూసుకుపోతోంది. తాజా సమాచారం ప్రకారం ఎంఎన్ఎఫ్ 27 స్థానాల్లో, కాంగ్రెస్ 9, బీజేపీ 1, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

10:34 AM

లైవ్: మిజోరం ఎన్నికల ఫలితాలు

మిజోరంలో కాంగ్రెస్‌పై ఎన్ఎంఎఫ్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో ఆ పార్టీ కార్యాలయం వద్ద శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.  ప్రస్తుతం ఎంఎన్ఎఫ్ 16, కాంగ్రెస్ 11 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

Aizawl: Sweets being distributed at Mizo National Front office (MNF) as the party leads in trends in Mizoram. pic.twitter.com/BMbwTUCSC0

— ANI (@ANI)

11:43 AM IST:

మిజోరం ఎన్నికల ఫలితాల్లో ఎంఎన్ఎఫ్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 8 స్థానాల్లో విజయం సాధించింది.

6:37 PM IST:

మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హవాలా తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించారు. తన సారథ్యంలోని పార్టీ ఓటమిపాలవడంతో బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.  ఈ పలితాలను తాను అస్సలు ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం వల్లే ఓడిపోయామని తన్హవాలా వెల్లడించారు.  
 
6:09 PM IST:

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి మిజో నేషనల్ ఫ్రంట్ పదేళ్ల తర్వాత అధికారాన్ని అందుకుంది. ఉదయం వెలువడిన ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను చేరుకుంది.

ఈ నేపథ్యంలో ఎంఎన్ఎఫ్ అధ్యక్షుడు జోరాంతంగ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీకి మూడు ప్రాధాన్యతలు ఉన్నాయని.. మద్య నిషేధం, రోడ్డ మరమ్మత్తులు, సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల అమలుపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.

అలాగే నూతన ప్రభుత్వంలో బీజేపీతో కానీ, మరో పార్టీతో కానీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. అయితే తాము ఈశాన్య ప్రజాస్వామిక కూటమి, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉంటామని జోరాంతంగ వెల్లడించారు. 

5:19 PM IST:

ఈశాన్య భారతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం మిజోరంలో ఆ పార్టీ కోల్పోయింది. ఉదయం వెలువడిన ఫలితాల్లో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 26 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.. కాంగ్రెస్ 5 స్థానాల్లో, బీజపీ 1, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు.

2013 అసెంబ్లీ ఎన్నికల్లో 34 సీట్లు సాధించి అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ.. కేవలం 5 స్థానాలకే సరిపెట్టుకుని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

2013 ఎన్నికల్లో పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 2,55,917 ఓట్లు రాగా.. ఈసారి ఎన్నికల్లో 1,90,307 ఓట్లు వచ్చాయి. ఇక ఎంఎన్ఎఫ్‌కు 2013లో 1,64,000 ఓట్లు రాగా.. 2018లో 2,37,119కి పెరిగాయి. దీనిని బట్టి కాంగ్రెస్‌కు ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. 

1:15 PM IST:

మిజోరం ఎన్నికల ఫలితాల్లో ఎంఎన్ఎఫ్ దూసుకెళ్తోంది.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మిజో నేషనల్ ఫ్రంట్ 12 చోట్ల, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. 
 
12:46 PM IST:

మిజోరం ఎన్నికల ఫలితాల్లో సంచలన ఫలితం వెలువడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తన్హావ్లా ఓటమి పాలయ్యారు.

చాంపై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం.. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి టీజే లాల్‌నుత్లుంగా చేతుల్లో 856 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మరో స్థానంలోనూ ఆయన ఓటమి పాలయ్యారు.

ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. ఎంఎన్ఎఫ్ అధికారం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఎంఎన్ఎఫ్ 29 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 
 
10:46 AM IST:

అధికారం దిశగా ఎంఎన్ఎఫ్ దూసుకుపోతోంది. తాజా సమాచారం ప్రకారం ఎంఎన్ఎఫ్ 27 స్థానాల్లో, కాంగ్రెస్ 9, బీజేపీ 1, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

10:37 AM IST: