భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ... రాగల 48గంటల్లో కుండపోత..

Published : Sep 13, 2022, 10:13 AM IST
భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ... రాగల 48గంటల్లో కుండపోత..

సారాంశం

క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాగల 48గంటల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 

న్యూఢిల్లీ : క్యుములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల దేశంలోని  పలు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ మంగళవారం విడుదల చేసిన ఒక వాతావరణ ప్రకటనలో వెల్లడించింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముంబై నగరంతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని ఐఎండీ పేర్కొంది. 

ముంబై నగరంలో ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. క్యుములోనింబస్ క్లౌడ్ ప్రభావం వల్ల మహారాష్ట్రలోని పూణే, అహ్మద్నగర్ ప్రాంతాల్లో  వచ్చే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని పూణే నగర ఐఎండీ విభాగం అధికారి డాక్టర్ అనుపం కశ్యప్ చెప్పారు.  డెహ్రాడూన్, చంపావత్, పిటోరాఘడ్, భాగేశ్వర్, నైనిటాల్ జిల్లాలో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

Heavy rains: భారీ వ‌ర్షాలు.. ప‌లు రాష్ట్రాల్లో పోటెత్తిన వ‌ర‌ద‌లు

దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోల్ కతా, హౌరా, పశ్చిమ మిడ్నాపూర్, బీర్భూమ్, ముర్షిదాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. చతిస్గడ్,  jharkhand, కొంకణ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. 

ఇదిలా ఉండగా, సోమవారం మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఔరంగాబాద్ లో నదిలో బట్టలు ఉతకటానికి వెళ్లిన ముగ్గురు మహిళలు ఒక్కసారిగా ముంచుకొచ్చిన వరదలో కొట్టుకుపోయారు. అదే సమయంలో భారీ వర్షాల కారణంగా ఛత్తీస్గఢ్లోని ఆరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. బస్తర్ జిల్లాలో చాలా ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. ఇది కాకుండా నేపాల్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని సీతామర్హి గుండా ప్రవహించే నదుల నీటి మట్టం పెరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ముగ్గురు మహిళలు దేవగిరి నదిలో బట్టలు ఉతకడానికి వెళ్లారు.  

భారీ వర్షంతో అకస్మాత్తుగా సంభవించిన వరద కారణంగా నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో నది పొంగిపొర్లుతూ వరదలు వచ్చాయి. సెకండ్లలో నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు.  అయితే, ఇది గమనించిన స్థానికులు, పోలీసులు చాలాసేపు కష్ట పడి ఇద్దరు మహిళలను తాజ్ నది ప్రవాహం మధ్యలో నుండి  సురక్షితంగా రక్షించారు. అయితే, రెస్క్యూ సమయంలో నది బలంగా ప్రవహించడంతో చాలామంది పోలీసులు కూడా నదిలో కొట్టుకుపోయారు. సురక్షితంగా బయటపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పూణే లో కురుస్తున్న భారీ వర్షాలు నగర రూపురేఖలను మార్చేశాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..