సైకిల్ పై వెళ్తున్న బాలుడిపై కుక్క దాడి.. వైరల్ వీడియో..!

Published : Sep 13, 2022, 09:47 AM IST
 సైకిల్ పై వెళ్తున్న బాలుడిపై కుక్క దాడి.. వైరల్ వీడియో..!

సారాంశం

తర్వాత తన ఇంటి దగ్గర సైకిల్ ఆపాడు. బాలుడు రాగానే అతని దగ్గరకు అతని స్నేహితులు కూడా వచ్చారు. అంతలోనే అక్కడకు ఎక్కడి నుంచి వచ్చిందో కుక్క వచ్చింది. ఆ బాలుడిపై విరుచుకుపడి.. అతని చేతిని కరిచింది.

రోడ్డు పై సైకిల్ మీద వెళ్తున్న ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. పాపం.. అలా కుక్క దాడి చేస్తుందనే ఆ బాలుడు కనీసం ఊహించలేదు. ఈ హఠాత్పరిణామానికి బాలుడు షాకయ్యాడు. అతను ఆ కుక్క నుంచి ఎంత తప్పించుకుందామని ప్రయత్నించినా.. అది వదలకుండా దాడి చేయడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కేరళ రాష్ట్రం కోజికోడ్ లోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సెలవురోు కావడంతో బాలుడు సరదాగా సైకిల్ మీద వెళ్లాడు. తర్వాత తన ఇంటి దగ్గర సైకిల్ ఆపాడు. బాలుడు రాగానే అతని దగ్గరకు అతని స్నేహితులు కూడా వచ్చారు. అంతలోనే అక్కడకు ఎక్కడి నుంచి వచ్చిందో కుక్క వచ్చింది. ఆ బాలుడిపై విరుచుకుపడి.. అతని చేతిని కరిచింది. కుక్క దాడి చేయడంతో భయపడిన ఇతర పిల్లలు అక్కడి నుంచి ఇళ్లల్లోకి పారిపోయారు. ఈ బాలుడిని మాత్రం కుక్క వదల్లేదు. చేతిని కొరుకుతూనే ఉండటం గమనార్హం.

 

బాలుడు కుక్క కాటు నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కుదర్లేదు. ఆ కుక్క బాలుడి చెయ్యి కనీసం వదల్లేదు. తర్వాత బాలుడు అతి కష్టం మీద తప్పించుకొని ఇంటిలోపలికి వెళ్లాడు. ఆ తర్వాత గ్రామస్థులు ఎక్కువ మంది రావడంతో.. కుక్క అక్కడి నుంచి పరారయ్యింది. ఈ వీడియో  చూస్తే ఎవరికైనా భయం వేయడం ఖాయం అన్నట్లుగా ఉంది. గ్రామంలోని సీసీకెమేరాలో ఈ వీడియో రికార్డు కావడం గమనార్హం.  ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఎలా ఉంది అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..