ప్రేమిస్తే లైంగిక సంబంధానికి ఒప్పుకొన్నట్టు కాదు: కేరళ హైకోర్టు తీర్పు

By narsimha lodeFirst Published Nov 21, 2021, 4:06 PM IST
Highlights

ప్రేమించినంత మాత్రాన లైంగిక సంబంధానికి అంగీకరించినట్టు కాదని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. బలవంతంగా సంబంధం పెట్టుకొంటే రేప్ కిందకే వస్తోందని కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది.
 


తిరువనంతపురం: ప్రేమించినంత మాత్రాన ప్రేమించిన వ్యక్తితో మహిళ లైంగిక సంబంధానికి అంగీకరించినట్టు కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది, ఆమెను బలవంత పెట్టి లైంగిక సంబంధం పెట్టుకొంటే అది కిడ్నాప్ తో పాటు  రేప్ కిందకే వస్తుందని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది.అంగీకారానికి, లొంగుబాటుకు చాలా తేడా ఉంటుందని  హైకోర్టు జస్టిస్  ఆర్. నారాయణ పిషరది చెప్పారు. నిస్సహాయ స్థితిలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె లైంగిక సంబంధంలో పాల్గొంటే అది అంగీకారం కాదన్నారు. ప్రేమిస్తున్నంత మాత్రాన అన్నింటికి అంగీకరించినట్టు కాదని Justice R Narayana Pisharadi  చెప్పారు.

Syam Sivan, అనే 26 ఏళ్ల వ్యక్తిపై అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ 376 తో పాటు ipcలోని పలు సెక్షన్ల కింద ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును శ్యామ్ శివన్  kerala high court  సవాల్ చేశారు.శ్యాం శివన్ తాను ప్రేమించిన బాలికను బెదిరించి మైసూరుకు తీసుకెళ్లి అక్కడ ఆమెపై rape చేశారు. ఆమె నగలు విక్రయించి మళ్లీ గోవా తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. తనతో రాకపోతే ఆత్మహత్య చేసకొంటానని హెచ్చరించాడు. దీంతో ఆమె అతడితో వెళ్లిందిత.

కొన్ని సందర్భాల్లో బాధితురాలు శ్యామ్  ను ప్రతిఘటించకపోయినా అది లైంగిక సంబంధానికి ఆమె సమ్మతించినట్టుగా పరిగణించినట్టు కాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఫోక్సో చట్టం కింద నిందితుడిపై  ట్రయల్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు రద్దు చేసింది.  నిందితుడికి ఐపీసీ సెక్షన్ 366, 376 కింద నేరాలు స్పష్టంగా ఉన్నాయని జస్టిస్ పిషారడి ఆదేశించింది.

 
 


 

click me!