బహుశా ప్రధాని డిగ్రీ నకిలీది కావచ్చు - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. గుజరాత్ హైకోర్టు తీర్పుపై అసంతృప్తి

Published : Apr 01, 2023, 02:40 PM IST
బహుశా ప్రధాని డిగ్రీ నకిలీది కావచ్చు - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. గుజరాత్ హైకోర్టు తీర్పుపై అసంతృప్తి

సారాంశం

ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్ల విషయంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆయన విద్యార్హతలపై మరింత అనుమానాలు పెంచుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. చదువుకోకపోవడం నేరం కాదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి చదువుకున్న ప్రధాని అవసరం అని తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్లు ప్రధాని కార్యాలయం సమర్పించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన ఒక రోజు తరువాత ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ మళ్లీ స్పందించారు. బహుశా ప్రధాని డిగ్రీ నకిలీది కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీపై విమర్శలు చేశారు.

ఇది ట్రయలే.. వచ్చే వారం మరో సంచలనం బయటికి : బాంబు పేల్చిన సుఖేష్ లాయర్ అనంత్ మాలిక్

పలు సందర్భాల్లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయని అన్నారు. ‘‘ఒకసారి మురుగు కాల్వల నుంచి వచ్చే గ్యాస్ తో టీ తయారు చేసుకోవచ్చని చెప్పారు. మరోసారి మేఘాల వెనుక ఉంటే విమానాన్ని రాడార్ గుర్తించలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆర్మీ సిబ్బందిని, విద్యార్థులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేశాయి’’ అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. 

వాతావరణ మార్పుల ఆందోళనపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు వాతావరణ మార్పు అంటే ఏమీ లేదని ప్రధాని మోడీ పిల్లలకు చెప్పారు. ఒక ప్రధాని అలా చెబితే దానిపై మనం ఎలా వ్యవహరించగలం ? ఆ కార్యక్రమంలోని పిల్లలు ఆయన మాటలకు మౌనంగా నవ్వడం నేను చూశాను.’’ అని అన్నారు. ఈ సంఘటనలు మన ప్రధాని విద్యా విశ్వసనీయతపై సందేహాలను రేకెత్తిస్తున్నాయని ఆయన అన్నారు. తాను (ప్రధాని) గ్రామంలోని పాఠశాలలకు వెళ్లానని, ఉన్నత విద్యను అభ్యసించలేదని ప్రధాని చెబుతున్న వీడియోను తాను చూశానని ఆయన పేర్కొన్నారు.

ఆ కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య.. లాడ్జిలో దిగిన తర్వాత నలుగురి బలవన్మరణం.. ఎందుకంటే?

నిరక్షరాస్యులుగా ఉండటం నేరం కాదని, వనరుల కొరత కారణంగా చాలా మంది విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరంగా ఉంటున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కానీ ప్రస్తుతం దేశానికి చదువుకున్న ప్రధాని అవసరమని, ఒక ప్రధాని ఒక్క రోజులో వందల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రధానికి చదువు లేకపోతే ఆయన చుట్టూ ఉన్న అధికారులు ఆయనను ప్రభావితం చేస్తారని ఆయన అన్నారు. నోట్లరద్దు దేశాన్ని కుదిపేసిందని, దేశాభివృద్ధిని పదేళ్ల ముందుకు తీసుకెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని చదువుకొని ఉంటే నోట్ల రద్దు ఎప్పటికీ అమలు అయ్యేది కాదన్నారు.

దేశంలో కొత్త‌గా 2,994 క‌రోనా కేసులు.. 2.09% పెరిగిన రోజువారి పాజిటివిటీ రేటు

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) గురించి కూడా ఆయన మాట్లాడారు. జీఎస్టీ అద్భుతమైన కాన్సెప్ట్ అని, కానీ భారత మార్కెట్లలో సరిగా అమలు చేయలేదని విమర్శించారు. విద్యావంతులైన ప్రధాని ఉండి ఉంటే ఈ విధానం జాగ్రత్తగా అమలయ్యేదని తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించిన తీరుపై ఆయన ప్రధానిపై విరుచుకుపడ్డారు. బిల్లుపై చర్చ జరగకుండా మోడీ ప్రభుత్వం తప్పించుకుందని ఆరోపించారు. ఇది చదువుకున్న ప్రధాని చేయలేదు కాబట్టే ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులు ప్రధాని మోడీ డిగ్రీపై అనుమానాలను మరింత పెంచిందని కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్, ఢిల్లీ విశ్వవిద్యాలయాల నుంచి ఆయన డిగ్రీ పూర్తి చేసి ఉంటే.. తమ విద్యార్థి దేశానికి ప్రధాని అయినందుకు గర్వపడాలని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం