ఇది ట్రయలే.. వచ్చే వారం మరో సంచలనం బయటికి : బాంబు పేల్చిన సుఖేష్ లాయర్ అనంత్ మాలిక్

Siva Kodati |  
Published : Apr 01, 2023, 02:19 PM IST
ఇది ట్రయలే.. వచ్చే వారం మరో సంచలనం బయటికి : బాంబు పేల్చిన సుఖేష్ లాయర్ అనంత్ మాలిక్

సారాంశం

వచ్చేవారం సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలనం బయటపెడతారని అన్నారు ఆయన తరపు లాయర్ అనంత్ మాలిక్.  గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి సుఖేష్ పనిచేశారని అనంత్ చెప్పారు.  

మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా బీఆర్ఎస్, ఆప్‌లపై ఆయన ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్‌కు రూ.75 కోట్లు ఇచ్చానని సుఖేష్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది. కాగా.. సుఖేష్ లాయర్ అనంత్ మాలిక్ మరో బాంబు పేల్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చేవారం సుఖేష్ మరో సంచలనం బయటపెడతారని అన్నారు. జైలు నుంచి ఇప్పటి వరకు ఆయన 12 లేఖలు రాశారని.. వీటిలో కొన్ని లేఖలపై హైపవర్ కమిటీ దర్యాప్తు చేస్తోందని అనంత్ మాలిక్ తెలిపారు. గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి సుఖేష్ పనిచేశారని అనంత్ చెప్పారు. 

కాగా.. సుఖేష్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం రాత్రి సంచలన లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్‌తో చేసిన వాట్సాప్ చాట్‌ తన వద్ద ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ చెప్పినట్టు బీఆర్ఎస్(BRS)కు రూ.75 కోట్లు ఇచ్చానని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట పార్కింగ్ చేసిన రోవర్ కారులో ఉన్న వ్యక్తి రూ. .15 కోట్లు ఇచ్చానని లేఖలో తెలిపారు. మొత్తం 15 కోట్ల చొప్పున ఐదుసార్లు రూ.75 కోట్లు ఇచ్చానని లేఖలో పేర్కొన్నారు. త్వరలోనే సీఎం కేజ్రీవాల్ తో చేసిన వాట్సాప్ చాట్ బయటపెడతానని, త్వరలోనే మరిన్ని అక్రమాలు బయటపెడతానని సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు.

ALso REad: 'బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా.. ' : సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు

2020లోసీఎం కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ చెప్పినట్లు బీఆర్ఎస్ ఆఫీస్ వద్దకు వచ్చి రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చాననీ, అతడు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం కొనసాగుతున్న మద్యం కేసు నిందితుల్లో ఒకరని ,  చాటింగ్ లో కొన్ని కోడ్ పదాలు వాడినట్టు పేర్కొన్నారు. 15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించానని అన్నారు. వారంలో కేజ్రీవాల్ తో చేసిన వాట్సాప్ చాటింగ్ విషయాలు బయటకు వస్తాయనీ,  కేజ్రీవాల్ అవినీతి, అక్రమాలు అన్నీ బయటపెడతానని సుఖేష్ అన్నారు. 

ఈ మొత్తం వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్‌తో తాను మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్‌లు చేస్తున్నానని, కేజ్రీవాల్‌కు 75 కోట్లు డెలివరీ చేశాడని పేర్కొంటూ జైలు శిక్ష అనుభవిస్తున్న కన్‌మన్ సుకేష్ చంద్రశేఖర్ నేడు (మార్చి 31) తన న్యాయవాది అనంత్ మాలిక్  ద్వారా ఒక లేఖను విడుదల చేశారు.

ఇటీవల.. సుకేష్ చంద్రశేఖర్ కోర్టులో హాజరుపరిచినప్పుడు, కేజ్రీవాల్ కి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, త్వరలో కేజ్రీవాల్‌ను తీహార్ క్లబ్‌లో స్వాగతిస్తారని, వచ్చే వారం ఓ ముఖ్యమైన విషయాన్ని బహిర్గతం చేస్తానని, ఇది కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ట్రైలర్ అవుతుందని మీడియాతో చెప్పారు.  మొత్తం మీద ఈ లేఖ దేశ రాజకీయాల్లో కలకలం రేగుతోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!