PM Modi: ప్రపంచానికి 'పెద్దన్న'గా నరేంద్ర మోదీ.. మొన్న భూటాన్‌, నేడు మారిషస్‌ ప్రధాని నోట ఒకే మాట.

Published : Mar 12, 2025, 12:09 PM ISTUpdated : Mar 12, 2025, 01:59 PM IST
PM Modi: ప్రపంచానికి 'పెద్దన్న'గా నరేంద్ర మోదీ.. మొన్న భూటాన్‌, నేడు మారిషస్‌ ప్రధాని నోట ఒకే మాట.

సారాంశం

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మారిషస్‌ పర్యటనలో బిజీగా ఉన్న ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్‌ వెళ్లిన ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే మారిషస్‌ ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.. 

మారిషస్‌ పర్యటలో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం లభించిన విషయం తెలిసిందే. మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ను ప్రధాని మోదీకి ప్రకటించారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు ప్రధాని మోదీ కాగా.. ఇది ఆయనకు వచ్చిన 21వ అంతర్జాతీయ అవార్డు కావడం విశేషం.  ఇదిలా ఉంటే మోదీ బీహార్‌లో తయారైన మఖానాను మారిషస్ ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులామ్ మోదీని "మారా భాయ్ మోదీ జీ" అని పిలిచారు. అంతకుముందు భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్గే కూడా మోదీని తన పెద్దన్నయ్యగా చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీకి భోజ్‌పురి పాటతో స్వాగతం పలికారు. ఇక మోదీ తన ప్రసంగాన్ని భోజ్‌పురిలో మొదలు పెట్టడం విశేషం. మారిషస్‌లోని ప్రజలతో మమేకం కావడానికి ఆయన భోజ్‌పురిలో మాట్లాడారు. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో కూడా మోదీ భోజ్‌పురిలో పోస్టులు చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా మారిషస్ టూర్ గురించి భోజ్‌పురిలో పోస్టులు చేశారు. 

భారత ప్రధాని మోదీకి ఇతర దేశాల నాయకుల నుంచి పెద్ద ఎత్తున గౌరవం లభిస్తోంది. గతంలో భూటాన్‌ ప్రధాని సైతం మోదీ తనకు పెద్దన్నయ్య లాంటి వారని తెలిపారు. ఫిబ్రవరి 21న మోదీ భారత్ మండపంలో "స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్" సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్గే కూడా పాల్గొన్నారు. ఆయన హిందీలో మోదీని పొగుడుతూ తన పెద్దన్నయ్య, గురువు అని అన్నారు. ప్రపంచ దేశాల్లో మోదీకి ఉన్న గౌరవానికి ఇదే నిదర్శనం అంటూ మోదీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu
Liquor sales: మందుబాబుల‌కు షాకింగ్ న్యూస్‌.. 28 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్‌. కార‌ణం ఏంటంటే.?