గతేడాది వివాహం.. కానీ ఇప్పుడే ఘోరం.. నిద్రపోయే ముందు దిండు కింద ప్రతీ రాత్రి..

By Asianet News  |  First Published Jul 17, 2023, 9:30 AM IST

భర్త చేష్టలు భరించలేక భార్య తన పుట్టింటికి వెళ్లింది. దీంతో అతడు అత్తగారి ఇంటికి వెళ్లి తనతో పాటు రావాలని భార్యను బతిమిలాడాడు. ఆమె వినకపోవడంతో కోపంతో ఆమెపై దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. 


ఓ భర్త తన భార్యను దారుణంగా హత మార్చాడు. ఆమె పుట్టింట్లో ఉండగా.. అక్కడకు వెళ్లి మరీ కిరాతకానికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన అత్తపై కూడా దాడి చేశాడు. దీంతో ఆమెకు కూడా గాయాలు అయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

పాకిస్థాన్ లో మరో హిందూ దేవాలయం ధ్వంసం.. రాకెట్లతో దాడి చేసిన దుండగులు.. 24 గంటల్లో రెండో ఘటన

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. మైసూరు సిటీకి సమీపంలో ఉన్న గుండ్లుపేటే తాలూకా బేరంబళ్లికి చెందిన 30 ఏళ్ల వి.మాదేశకు గత సంవత్సరం 21 ఏళ్ల హర్షితతో వివాహం అయ్యింది. మండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని చినకురళి ఆమె పుట్టిన ఊరు. కాగా.. ఈ దంపతులు పెళ్లయిన కొత్తలో అనోన్యంగా ఉన్నారు. కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితంగా సక్రమంగా సాగింది.

కొన్ని నెలల తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. వారి మధ్య అప్పుడప్పుడు వాగ్వాదాలు చోటు చేసుకునేవి. ఈ క్రమంలో మాదేశ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ప్రతీ రోజూ రాత్రి నిద్రపోయే ముందు తల దిండు కింద కొడవలిని ఉంచుకునేవాడు. భర్త తీరు పట్ల హర్షితకు భయం వేసింది. ఈ విషయాన్ని అతడికి చెప్పినా పట్టించకోకపోవడంతో విసుగు చెంది పుట్టింటికి వెళ్లేది.

ముంబైలో మార్వే క్రీక్ లో మునిగిన ఐదుగురు బాలురు.. ముగ్గురు గల్లంతు.. ఇద్దరిని రక్షించిన స్థానికులు

దీంతో మాదేశ అత్తగారి ఇంటికి వెళ్లి బతిమిలాడి ఆమెను తన ఇంటికి వచ్చేలా ఒప్పించేవాడు. భర్తను నమ్మి ఆమె అతడి వెంట వచ్చేది. కానీ మళ్లీ అప్పుడప్పుడు వారి మధ్య గొడవలు జరిగేవి. ఇటీవల దంపతుల మధ్య వాగ్వాదాలు పెరిగాయి. దీంతో హర్షిత మళ్లీ పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచే అక్కడే ఉంటోంది. అయితే భార్యపై కోపం పెంచుకున్న మాదేశ కొడవలి తీసుకొని ఆదివారం అత్తగారి ఇంటికి వెళ్లాడు. హర్షితను ఇంటికి రావాలని కోరాడు. ఆమె దానికి నిరాకరించింది.

సముద్రం ఒడ్డున భర్తతో కలిసి ఫొటో తీసుకుంటుండగా విషాదం.. మహిళను లోపలికి లాక్కెళ్లిన భారీ అల.. వీడియో వైరల్

ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో అతడు తన వెంట తెచ్చుకున్న కొడవలితో ఆమెపై దాడి చేశాడు. కూతురుపై దాడి జరుగుతుండటంతో ఆమె తల్లి గీత అక్కడికి చేరుకుంది. అల్లుడి దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఆమెపై కూడా మదేశ దాడి చేశాడు. దీంతో గీతకు కూడా గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై మేటిగట్టి పోలీసులకు సమాచారం అందింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. 
 

click me!