తమిళనాడులో మరో మంత్రిపై ఈడీ నజర్.. పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్న అధికారులు.. (వీడియో)

Published : Jul 17, 2023, 09:28 AM ISTUpdated : Jul 17, 2023, 10:11 AM IST
తమిళనాడులో మరో మంత్రిపై ఈడీ నజర్.. పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్న అధికారులు..  (వీడియో)

సారాంశం

తమిళనాడులో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడి‌పై ఈడీ దాడులు చేస్తోంది.

చెన్నై: తమిళనాడులో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ ఆస్తులపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి.. ఆయనను అరెస్ట్  చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడి‌పై ఈడీ దాడులు చేస్తోంది. మంత్రి పొన్ముడితో పాటు ఆయన కుమారుడైన లోక్‌సభ సభ్యుడు గౌతమ్‌ సిగమణికి సంబంధించి ప్రాంగణాల్లో ఈడీ అధికారులు సోమవారం సోదాలు  చేపట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. 

చెన్నైలోని మంత్రి పొన్ముడి ఇంటితో పాటు తొమ్మిది చోట్ల ఈడీ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. విలుప్పురం జిల్లాలోని మంత్రి ఇల్లు, సూర్య ఇంజినీరింగ్ కళాశాలలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Axis Bank Rules : యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్, ఏంటో తెలుసా?
Shakuntala Railways: దేశంలో ప్రైవేట్ యాజ‌మాన్యంలో న‌డిచే ఏకైక‌ రైల్వే లైన్ ఇదే