మ్యారిటల్ రేప్ నేరం కాదు.. దీపక్ మిశ్రా షాకింగ్ కామెంట్స్

By ramya NFirst Published Apr 9, 2019, 12:46 PM IST
Highlights

మ్యారిటల్ రేప్ పై మాజీ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. మ్యారిటల్ రేప్ అసలు నేరమే కాదు అని ఆయన పేర్కొన్నారు. 

మ్యారిటల్ రేప్ పై మాజీ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. మ్యారిటల్ రేప్ అసలు నేరమే కాదు అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ట్రాన్స్ఫేటివ్ కాన్స్టిట్యూషనల్ ఆఫ్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మ్యారిటల్ రేప్ నేరం కాదన్నారు. దానికోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సిన అసవరం కూడా లేదన్నారు. అయితే.. అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.

‘ కొన్ని దేశాల్లో మ్యారిటల్ రేప్ నేరం కావచ్చు. కానీ మనదేశంలో మాత్రం దానిని నేరం కింద భావించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈ చట్టం కారణంగా గ్రామాల్లో చాలా మంది ఇళ్లల్లో  అరాచకం సృష్టిస్తుంది.  కుటుంబ విలువల కారణంగానే మన దేశం ఇప్పటికీ సస్టైన్ అవుతోంది.  ఇప్పటికీ మనకు కుటుంబ విలువలు ఉన్నాయి. వాటిని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

ఓ లా విద్యార్థి మ్యారిటల్ రేప్ పై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన పైవిధంగా స్పందించారు. అంతేకాకుండా అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని క్లారిటీ ఇచ్చారు. 

పెళ్లి తర్వాత.. భార్యకు ఇష్టం లేకుండా భర్త సెక్స్ కి బలవంత పెట్టడాన్ని మ్యారిటల్ రేప్ అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. 

click me!