ఒడిశాలో ఎదురుకాల్పులు.. తప్పించుకున్న ఆర్కే.. గాయపడి ఉండొచ్చా..?

By sivanagaprasad kodatiFirst Published Oct 8, 2018, 8:52 AM IST
Highlights

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఆదివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో.. మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. 

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఆదివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో.. మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆయనతో పాటు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి, అరుణ అలియాస్ వెంకటరవి చైతన్యలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితిలోని చందకా-గంగరాజ్‌పూర్ సరిహద్దులో సశారామ్ సమీపంలోని చిక్కల్‌ములి అటవీప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైనట్లుగా పోలీసులకు సమాచారం అందింది.

దీంతో డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. 15 నుంచి 20 మంది మావోలు శిబిరంలో తలదాచుకున్నారని గుర్తించిన బలగాలు.. వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించాయి. దీంతో మావోయిస్టులకు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

అయితే కాల్పుల అనంతరం మావోలు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం భద్రతా దళాలు నక్సల్స్ శిబిరాన్ని ధ్వంసం చేసి భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన దళ సభ్యులు వీరే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

జంట హత్యల అనంతరం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే క్రమంలో పోలీసులకు ఎదురుపడ్డారని తెలుస్తోంది. మరోవైపు ఆర్కే కోసం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఏపీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ మొదలుపెట్టాయి. 

కిడారి హత్య : నాటుకోడి విందులో పోలీసులు.. జీలుగ కల్లు మత్తులో మావోలు

కిడారి హత్య: కారులో రూ.3 కోట్లు ఏమయ్యాయి?

ఎమ్మెల్యే హత్య: కిడారిని ట్రాప్ చేసి.. బంధువులే నమ్మకద్రోహం

కిడారి హత్య: పోలీసుల అదుపులో మాజీ ఎంపీటీసీ సుబ్బారావు

కిడారి హత్య: టీడీపీ నేత హస్తం, రెండోసారి మావోల ప్లాన్ సక్సెస్

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

click me!