యూపీలో దారుణం.. లిఫ్ట్ ఇచ్చి యువతిపై గ్యాంగ్‌రేప్

sivanagaprasad kodati |  
Published : Oct 07, 2018, 05:27 PM IST
యూపీలో దారుణం.. లిఫ్ట్ ఇచ్చి యువతిపై గ్యాంగ్‌రేప్

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఒక యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధాన జిల్లాలోని ఫుగ్నాకి చెందిన ఓ ఇరవై నాలుగేళ్ల యువతి బుధానలో పని ముగించుకుని తిరిగి తన ఇంటికి వెళ్లేందుకు బస్టాప్‌లో బస్సు  కోసం ఎదురుచూస్తోంది.

ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఆమె దగ్గరికి వెళ్లి.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఎక్కించుకున్నారు. అనంతరం బలవంతంగా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని చెప్పి అక్కడి నుంచి పారిపోయారు. జరిగిన సంఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించి.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం