
ఒడిశా : చిన్న చిన్న విషయాలకే ఆగ్రహావేశాలకు లోనై దాడులు చేసుకునే ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒడిశాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఒడిశా రాష్ట్రం, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లా మల్కన్‌గిరి సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌గూడ పంచాయతీలోని మాజిగూడ గ్రామంలో బుధవారం సాయంత్రం 35 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపారు. ఆ తరువాత అతడి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు.
మృతుడు దేబా మద్కామిగా గుర్తించారు. మంగళవారం అదే గ్రామానికి చెందిన మాలి మధి అనే 24 ఏళ్ల మహిళపై దేబా మద్కామి దాడి చేశాడు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన గ్రామస్తుల బృందం అతనిపై దాడి చేసినట్లు సమాచారం.
ప్రధానిని కలిసిన యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. మోడీ ఏమన్నారంటే...
"బోరింగు దగ్గర మాలి మధి అనే 24 ఏళ్ల మహిళ పాత్రలు శుభ్రం చేస్తుండగా దేబా మద్కామి ఆమె మీద దాడి చేశాడు. ఈ దాడిలో మాలి మధి ముఖం, మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి" అని మల్కన్‌గిరి సదర్ పోలీస్ స్టేషన్ ఐఐసి రిగన్ కిండో తెలిపారు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన గ్రామస్తులు దేబా మీద దాడి చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని రిగన్ కిండో తెలిపారు.