సెక్స్ కు ఒప్పుకోలేదని ఆ యువకుడు ఏం చేశాడంటే...

By Nagaraju TFirst Published Sep 24, 2018, 9:10 PM IST
Highlights

అతని వయసు 46 ఏళ్లు. యువకుడి వయసు 23 ఏళ్లు. అంటే సరిగ్గా అతడి వయసులో సగం. అయితే వీరిద్దరి మధ్య గత రెండేళ్ల నుంచి స్వలింగ సంబంధం ఉంది. వీరిద్దరూ తరుచు కలుసుకునే వారు. ఎంజాయ్ చేసేవారు. 

పుణె : అతని వయసు 46 ఏళ్లు. యువకుడి వయసు 23 ఏళ్లు. అంటే సరిగ్గా అతడి వయసులో సగం. అయితే వీరిద్దరి మధ్య గత రెండేళ్ల నుంచి స్వలింగ సంబంధం ఉంది. వీరిద్దరూ తరుచు కలుసుకునే వారు. ఎంజాయ్ చేసేవారు. 

అయితే ఈనెల 19న ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు. ఇద్దరు ఒకసారి శృంగారం చేసుకున్నారు. రెండోసారి చేసేందుకు 46 ఏళ్ల వ్యక్తి అంగీకరించలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన 23 ఏళ్ల యువకుడు అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పూణెలో చోటు చేసుకుంది. 

యువకుడి చేతిలో తీవ్రగాయాలపాలైన బాధితుడు ఖడక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే బాధిత వ్యక్తి వ్యాపార వేత్త కాగా, యువకుడు ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  

వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్య చట్టబద్ధమేనని చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

click me!