ఢిల్లీ బస్సులో బాలిక పక్కనే కూర్చుని హస్తప్రయోగం.. పట్టుకుని ప్రశ్నించగానే ఏడ్చేసిన వైనం.. వీడియో వైరల్

Published : Jan 05, 2023, 03:52 PM ISTUpdated : Jan 12, 2023, 01:36 PM IST
ఢిల్లీ బస్సులో బాలిక పక్కనే కూర్చుని హస్తప్రయోగం.. పట్టుకుని ప్రశ్నించగానే ఏడ్చేసిన వైనం.. వీడియో వైరల్

సారాంశం

ఢిల్లీ బస్సులో బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక ఎదుటే హస్తప్రయోగం చేశాడు. దీంతో ఆమె బస్సులోని మార్షల్‌కు సమాచారం ఇవ్వడంతే అతను వెంటనే నిందితుడిని పట్టుకున్నాడు. అనంతరం, నిందితుడు ఏడ్చేశాడు. అతడిని పోలీసులకు అప్పగించారు.  

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి బస్సులో అదీ.. బాలిక పక్కన కూర్చుని హస్తప్రయోగం చేశాడు. బాలిక ఎదుటే ఇలా చేయడంతో ఆమె హడలిపోయింది. వెంటనే కేకలు వేసింది. బస్సులోని మార్షల్ వచ్చి అతడిని పట్టుకుని ప్రశ్నించగా.. అతను ఏడుపు మొదలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పోలీసులు అతడిని ఇంకా అరెస్టు చేయలేదు. ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కేసు నమోదు కాలేదని, అతడినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

వైరల్ వీడియో ప్రకారం, డీటీసీ బస్సులో నిందితుడు మంగళవారం మాస్టర్బేట్‌కు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని ఓ బాలిక బస్సులోని మార్షల్ సందీప్ చకారాకు తెలిపింది. అతను వెంటనే నిందితుడి ని పట్టుకున్నాడు. అతడి ని పట్టుకోగానే నిందితుడు ఏడవడం మొదలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: ఇదేం పిచ్చిపని.. మూడేళ్ల చిన్నారిని పట్టాలమీదికి తోసేసి.. నింపాదిగా కూర్చుంది.. కారణం ఏంటంటే..

నిందితుడు బిహార్‌కు చెందినవాడిగా గుర్తించారు. అతడిని పోలీసులకు అప్పగించారు. కానీ, పోలీసులు ఇంకా ఫిర్యాదు అందని కారణంగా అతడిని అరెస్టు చేయలేదు. 

ఈ ఘటన గురించి సమాచారం తెలియగానే బుధవారం నార్త్ రోహిణి పోలీసు స్టేషన్ ఎస్ఐ సుమన్ దర్యాప్తు చేసినట్టు ఓ అధికారి తెలిపారు. ఈ ఘటనపై తన స్టేట్‌మెంట్ ఇవ్వాలని, లేదా ఫిర్యాదు అందించాలని కోరగా.. ఆమె తిరస్కరించిందని పేర్కొన్నారు.

భవిష్యత్‌లోనూ ఇలంాటి ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు అందితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని, చట్టానికి లోబడి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu