హల్ద్వానీలో ఇళ్ల కూల్చివేతపై సుప్రీంకోర్టు స్టే.. రాత్రికి రాత్రే 50 వేల మందిని తొలగించలేరంటూ వ్యాఖ్యలు

By team teluguFirst Published Jan 5, 2023, 3:11 PM IST
Highlights

వేలాది మంది రోడ్లపైకి వచ్చి కొవ్వొత్తుల ర్యాలీలు, ధర్నాలు, నిరసనలకు కారణమైన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమణల తొలగింపునకు సుప్రీంకోర్టు స్టే విధించింది. అంత మందిని ఒకే సారి ఖాళీ చేయింలేమని, దీనికి ఇతర మార్గం కనుగొనాలని సూచించింది. 

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హల్ద్వానీలోని 29 ఎకరాల రైల్వే భూమిలో ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. అలాగే ఆక్రమణల తొలగింపునకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

తొలగింపును నిలిపివేయాలని కొవ్వొత్తుల ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు తెలుపుతున్న వేలాది మంది నిర్వాసితులకు సుప్రీంకోర్టు ఆదేశాలు భారీ ఉపశమనాన్ని అందించాయి. ‘‘ రాత్రికి రాత్రే 50 వేల మందిని తొలగించలేం. ఇది మానవ సమస్య. ఆచరణీయ పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది’’ అంటూ ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. 4,000 ఇళ్లలో నివసిస్తున్న దాదాపు 50,000 మందిని ఖాళీ చేయడానికి అనుమతి ఇచ్చిన ఉత్తరాఖండ్ హైకోర్టు ఉత్తర్వులపై కూడా స్టే విధించింది.

బెంగళూరు ఎయిర్‌పోర్టులో చెకింగ్ అధికారులు బలవంతంగా నా షర్ట్ విప్పించారు.. మహిళ ఆరోపణ.. సీఐఎస్ఎఫ్ కౌంటర్

ప్రజలను ఖాళీ చేయించడానికి బలప్రయోగం చేయాలని హైకోర్టు చేసిన సూచనను ప్రస్తావిస్తూ.. దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజలను తొలగించడానికి పారామిలిటరీ దళాలను మోహరించాలని చెప్పడం సరైనది కాకపోవచ్చు అని పేర్కొంది. ఈ ప్రాంతంలో ఎలాంట నిర్మాణాన్ని తొలగించకూడదని ఆదేశాలు జారీ చేస్తూ.. రైల్వేలు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి ప్రతిస్పందనలను వచ్చిన తరువాత వచ్చే నెలలో ఈ కేసు మళ్లీ విచారణకు వస్తుందని పేర్కొంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ పీఎస్ నరసింహ ఈ కేసును విచారణకు స్వీకరించారు. పిటిషనర్లతో పాటు నివాసితుల టైటిల్‌కు సంబంధించిన ప్రొసీడింగ్‌లు జిల్లా మేజిస్ట్రేట్ ముందు పెండింగ్‌లో ఉన్నాయన్న వాస్తవం తెలిసినప్పటికీ, హైకోర్టు నిషేధించబడిన ఉత్తర్వులను ఆమోదించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిందని నివాసితులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ కేసు తదుపరి విచారణకు ఫిబ్రవరి 7కు వాయిదా వేశారు.

మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని మహిళా డాక్టర్ ఆత్మహత్య.. టెన్షన్ తట్టుకోలేకే అంటూ..

హల్ద్వానీ రైల్వే స్టేషన్ సమీపంలో బన్బుల్పురా ప్రాంతంలోని గఫూర్ బస్తీ, ధోలక్ బస్తీ, ఇందిరా నగర్ సమీపంలో 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ వివాదాస్పద ప్రాంతం ఉంది. హల్ద్వానీలోని బంభూల్‌పురాలో ఆక్రమణకు గురైన 29 ఎకరాల రైల్వే భూమిలో మతపరమైన స్థలాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు, నివాసాలు ఉన్నాయి. అయితే బన్‌భూల్‌పురా వద్ద ఆక్రమణకు గురైన రైల్వే భూమిలో నిర్మాణాలను కూల్చివేయాలని గతేడాది డిసెంబర్ 20న హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఆక్రమణదారులకు వారం రోజుల గడువు ఇవ్వాలని, ఆ తర్వాత ఆక్రమణలను కూల్చివేయాలని పేర్కొంది. 

2013లో ఈ ప్రాంతానికి సమీపంలోని నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ పిటిషన్ దాఖలు కావడంతో ఈ అంశం కోర్టుకు చేరింది. సుదీర్ఘ విచారణల తరువాత డిసెంబర్ 20న కోర్టు ఆదేశాలను అనుసరించి జిల్లా యంత్రాంగం జనవరి 9లోగా ప్రజలు తమ వస్తువులను తీసుకెళ్లాలని, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పత్రికల్లో నోటీసు జారీ చేసింది.

పఠాన్ సినిమాపై బజరంగ్ దళ్, వీహెచ్ పీ ఆగ్రహం.. అహ్మదాబాద్ లో కార్యకర్తల ఆందోళనలు, పోస్టర్లు చించివేత

అయితే దీనిపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఎక్కువగా ముస్లింలు నివసిస్తుంటారు. అందుకే అధికార బీజేపీ ఇలాంటి చర్యకు పూనుకుందని ఆరోపిస్తూ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లోని తన ఇంటిలో గంటసేపు మౌన ధీక్ష చేపట్టారు. ఉత్తరాఖండ్ ఒక ఆధ్యాత్మిక రాష్ట్రమని, పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, మహిళలతో పాటు 50,000 మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చారని అన్నారు. అది చాలా విచారకరమైన దృశ్యం అని తెలిపారు. కాగా.. సుప్రీంకోర్టు తీర్పును తమ ప్రభుత్వం గౌరవిస్తుందని సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు.
 

click me!