Agnipath : ఆర్మీ రిక్రూట్‌మెంట్ లో పెనుమార్పు.. ‘అగ్నిపథ్ స్కీమ్’ ను ప్రకటించిన రాజ్ నాథ్ సింగ్

By team teluguFirst Published Jun 14, 2022, 2:04 PM IST
Highlights

త్రివిధ దళాల్లో యువత భాగస్వామ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్వల్పకాల వ్యవధిలో యువతను సైన్యంలోకి తీసుకోవడానికి అగ్నిపథ్ అనే కొత్త రిక్రూట్ మెంట్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ను మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. 

ఆర్మీలో రిక్రూట్మెంట్ ప్రక్రియలో పెను మార్పుల కోసం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ‘అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్’ ను ప్రకటించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం త్రివిధ దళాల అధిపతుల‌తో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ అగ్నిపథ్ పరివర్తన పథకానికి ఆమోదం తెలిపి క్యాబినెట్ కమిటీ ఈరోజు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని కింద భారతీయ యువత సాయుధ సేవల్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది ’’ అని తెలిపారు. 

National Herald case: ఎఫ్‌ఐఆర్ ఏది?.. రాహుల్‌ను ఈడీ ప్రశ్నించడంపై బీజేపీపై చిదంబ‌రం ఫైర్

ఏమిటి ఈ అగ్నిప‌థ్ స్కీమ్ ? 
నాలుగేళ్ల పాటు యువ‌త‌ను భార‌త త్రివిధ ద‌ళాల్లో జాయిన్ చేసుకోవ‌డ‌మే ఈ అగ్నిప‌థ్ రిక్రూట్ మెంట్ స్కీమ్ ప్ర‌ధాన ఉద్దేశం. ఈ ప‌థ‌కం కింద ఉద్యోగంలో చేరిన వారిని ‘అగ్నివీర్’ అని పిలుస్తారు. ఉద్యోగం కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో అగ్ని వీర్లకు ఆకర్షణీర్షయమైన జీతం లభిస్తుంది. నాలుగు సంవత్సరాల త‌రువాత ప్యాకేజీ రూపంలో న‌గ‌దును అంద‌జేస్తారు. అయితే ఇందులో ప‌ని చేసి వ‌చ్చిన వారికి వివిధ ఉద్యోగాల్లో అవ‌కాశాలు క‌ల్పిస్తారు. 

కేరళ సీఎం పినరయి విజయన్ కు విమానంలో నిరసన సెగ..

ఈ పథకం కింద రిక్రూట్ అయిన చాలా మంది సైనికులు నాలుగేళ్ల తర్వా త విముక్తి పొందుతారు. కొంత మందిని మాత్రం కొన‌సాగిస్తారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల యువతకు ఇందులో చేరేందుకు అవ‌కాశం ఉంటుంది. ఎంపికైన వారికి 10 వారాల నుండి 6 నెలల వరకు శిక్ష‌ణ ఉంటుంది. దీని కోసం విద్యార్హ‌త ప‌ది లేదా ఇంట‌ర్ మీడియ‌ట్ గా నిర్ణ‌యించారు. 90 రోజులలో అగ్నివీర్ల మొదటి రిక్రూట్మెంట్ ఉండ‌నుంది. పదవీ విరమణ తర్వాత పెన్షన్ ఉండదు. పెన్ష‌న్ కు సంబంధించిన ప్యాకేజ్ మొత్తం ఒకేసారి అందిస్తారు. సైన్యంలోని ఏ రెజిమెంట్‌లోనూ కులం, మతం, ప్రాంతం ఆధారంగా రిక్రూట్‌మెంట్ ఉండదు.

జీతం ఎంత వ‌ర‌కు ఉంటుంది ? 
అగ్నిప‌థ్ రిక్రూట్ మెంట్ స్కీమ్ కింద ఎంపికైన అభ్య‌ర్థుల‌కు మొదటి సంవ‌త్స‌రంలో రూ.4.76 లక్షల వార్షిక ప్యాకేజిని అందిస్తారు. అది నాలుగో సంవత్స‌రం నాటికి 6.92 లక్షలకు పెరగనుంది. ఇది కాకుండా రిస్క్ అల‌వెన్సులు, ఇత‌ర అల‌వెన్సులు అంద‌జేస్తారు. నాలుగేళ్ల సర్వీసు ముగిసిన త‌ర్వాత య‌వ‌త‌కు రూ.11.7 లక్షలను సేవా నిధి రూపంలో అందజేస్తారు. దీనిపై ఎలాంటి ట్యాక్స్ ఉండ‌దు. 

President Election 2022: బరిలో లేనన్న శరద్ పవార్.. గులాం నబీ ఆజాద్ వైపు చూపు.. పవార్ ప్లాన్ ఏమిటీ?

అగ్నిప‌థ్ స్కీమ్ వ‌ల్ల ఉప‌యోగాలు..
దేశానికి సేవ చేయాలనే స్ఫూర్తి ఉన్న యువతకు అగ్నిప‌థ్ స్కీమ్ మంచి అవ‌కాశంగా మార‌నుంది. స్వ‌ల్ప కాలం సేవ‌లందించి త‌రువాత ఇత‌ర ఉద్యోగాల‌కు వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే త్రివ‌ధ ద‌ళాల్లో యువ‌త భాగ‌స్వామ్యం పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల సైన్యా నికి కోట్లాది రూపాయిలు ఖర్చు ఆదాకానుంది. నాలుగేళ్ల త‌రువాత కూడా కొన‌సాగే కొద్ది మంది అగ్నివీర్ల‌కు మాత్ర‌మే పెన్ష‌న్ ఇవ్వాల్సి ఉంటుంది. మరో వైపు జీతంలో కూడా పొదుపు కానుంది. కాగా ఇటీవ‌లే త్రివిధ ద‌ళాల అధిప‌తులు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసి, ఈ రిక్రూట్ మెంట్ స్కీమ్ ను వివ‌రించారు. 

click me!