నిజం దాచి నంపుసకుడితో పెళ్లి.. మామ లైంగికవేధింపులు, కోడిరక్తం తాగాలని బలవంతం... !

Published : Sep 23, 2021, 01:41 PM IST
నిజం దాచి నంపుసకుడితో పెళ్లి.. మామ లైంగికవేధింపులు, కోడిరక్తం తాగాలని బలవంతం... !

సారాంశం

మీడియా నివేదికల ప్రకారం, మామ, భర్త ఇద్దరూ.. తనను తాను దేవుడిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి సూచనల మేరకే ఇలా చేశారని తేలింది. వీరితో పాటు వీరికి సహకరించిన బాధిత మహిళ అత్తగారిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

పూణే : మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత మీద భర్త,, మామ లైంగిక వేధింపు(Sexual Harassment) లకు పాల్పడ్డారు. అంతేకాకుండా బలవంతంగా కోడి రక్తాన్ని(Chicken Blood) తాగించాలని ప్రయత్నించారు. ఈ కేసులో సదరు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు మామను, భర్తను పోలీసులు అరెస్టు చేశారు. 

మీడియా నివేదికల ప్రకారం, మామ, భర్త ఇద్దరూ.. తనను తాను దేవుడిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి సూచనల మేరకే ఇలా చేశారని తేలింది. వీరితో పాటు వీరికి సహకరించిన బాధిత మహిళ అత్తగారిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

బాధిత మహిళ (33) కథనం ప్రకారం.. తన భర్త నపుంసకుడు అని, వివాహం సమయంలో అత్తమామలు ఈ విషయాన్ని దాచిపెట్టి, నిజం తెలియకుండా పెళ్లి చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాదు తనను గర్బవతిని చేయడానికి మామ తన మీద లైంగికంగా ఒత్తిడి తెచ్చేవాడని వాపోయింది. బాధితురాలు భర్త నపుంసకత్వానికి సంబంధించిన వాస్తవాన్ని తన బంధువులతో చెప్పుకుంది. దీంతో కోపానికి వచ్చిన అత్తమామలు ఆమెపై శారీరకంగా దాడి చేశారని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

Blast in Banglore: ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

దీని ప్రకారం "సదరు భర్త  డిప్లొమా ఇంజనీర్ చేశాడు. బాదితురాలు బ్యాచిలర్ డిగ్రీ చదువుకుంది. వీరిద్దరికీ డిసెంబర్ 30, 2018 వివాహం అయ్యింది. గొడవల నేపథ్యంలో గత నాలుగు నెలలుగా వీరు విడివిడిగా నివసిస్తున్నారు. ఫిర్యాదులో చేసిన అన్ని క్లెయిమ్‌లపై మేం దర్యాప్తు చేస్తాం. ఇద్దరిని అరెస్టు చేశాం ”అని భోసారి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర కదమ్ తెలిపారు. 

అంతేకాదు పెళ్లైన 2018 నుంచి తన అత్తమామలు తనను మానసికంగా, శారీరకంగా హింసించారని మహిళ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. వీరిమీద సెక్షన్లు 498 (a), 354 (a), 323, 504, 506, 34 ప్రకారం భారతీయ శిక్షాస్మృతి, HT, మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైజ్ అండ్ అదర్ ఇన్ హ్యూమన్, ఇవిల్, అఘోరీ అభ్యాసాల సెక్షన్ 3 తో ​​పాటుగా అనేక సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. దీంతోపాటు బ్లాక్ మ్యాజిక్ యాక్ట్, 2013 కింద కూడా భోసారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu