స్టార్టప్‌తో కాసులు కురిపించారు.. 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు!

By telugu teamFirst Published Sep 23, 2021, 1:27 PM IST
Highlights

అదొక చిన్న స్టార్టప్ కంపెనీ. ఆరుగురు సభ్యులతో మొదలై అంచెలంచెలుగా ఎదిగింది. 2010లో స్థాపించిన తర్వాత ఐదేళ్లకు 500 మంది ఉద్యోగులకు ఉపాధినిచ్చేలా మారింది. ఇప్పుడు సుమారు 4,300 మంది ఉద్యోగులు ఇందులోపనిచేస్తున్నారు. అమెరికాలోని నాస్డాక్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఈ కంపెనీ లిస్టవ్వడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ అమాంతం పెరిగింది. దీంతో అందులోని కనీసం 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు.
 

చెన్నై: కొందరు యువకులు స్టార్టప్(startup) పెట్టి కోట్లు గడించారు. వ్యవస్థాపకులే కాదు.. అందులోని ఉద్యోగులనూ కోటీశ్వరులు(crorepatis) చేశారు. 2010లో కేవలం ఆరుగురు మొదలుపెట్టిన ఆ సంస్థ ఇప్పుడు అమెరికాలోని నాస్డాక్(nasdaq) స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్టు అయింది. దీంతో కాసుల వర్షం కురిసింది. నాస్డాక్‌లో లిస్టింగ్ కావడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ అమాంతం పెరిగింది. దీంతో కంపెనీలోని సుమారు 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు.

చెన్నైలో ఆరుగురు ఎంటర్‌ప్రెన్యూయర్లు కలిసి 2010లో సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్(ఎస్ఏఏఎస్) స్టార్టప్ ఫ్రెష్‌వర్క్స్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ అంచెలంచెలుగా ఎదిగుతూ వచ్చింది. 2015నాటికి ఈ కంపెనీలో 500 ఉద్యోగులున్నారు. ఇప్పుడు సుమారు 4,300 మందికి ఉపాధినిస్తున్నది. అమెరికా స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఫ్రెష్ వర్క్స్ కంపెనీ లిస్టింగ్ కావడం టర్నింగ్ పాయింట్‌గా మారింది. నాస్డాక్‌లో లిస్ట్ అయిన తొలి స్టార్టప్‌గా రికార్డు సృష్టించింది.

ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో గిరీశ్ మాట్లాడుతూ ఐపీవోకు వెళ్లడంతో ఎంప్లాయీస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ ద్వారా ఉద్యోగులకు కాసుల పంట పండిందన్నారు. సంపద సృష్టికర్తలకు వాటిని పంచాల్సిన అవసరముందని తెలిపారు. కంపెనీ ఎదుగుదలకు వారు ఎంతో కృషి చేశాని, ప్రతిఫలాలనూ వారికి చేరాలని వివరించారు.

click me!