మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన పదవుల పంపకం: ఎన్సీపికి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కి....

By Nagaraju penumalaFirst Published Nov 27, 2019, 9:56 PM IST
Highlights

డిసెంబర్ 3 తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రపుల్ పాటిల్ తెలిపారు. ఈ భేటీలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌లతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అహ్మద్‌ పటేల్‌, మాణిక్‌రావ్‌ ఠాక్రే పాల్గొన్నారు.  
 

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిసిన అనంతరం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి మహారాష్ట్ర వికాస్ అఘాది సమావేశమైంది. 

పదవుల పంపకం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, అతిథులుగా ఎవరిని పిలవాలి అనే అంశాలపై సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవి కేటాయించినట్లు ఎన్సీపీ నేత ప్రపుల్ పాటిల్ స్పష్టం చేశారు. 

ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కటే ఉంటుందని అది ఎన్సీపీకే ఇవ్వాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం 6.40 గంటలకు శివాజీ పార్క్ లో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. 

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోపాటు ప్రతీ పార్టీ నుంచి ఒక్కరూ లేదా ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలపారు. బుధవారం అర్థరాత్రి పదవులపై మరింత క్లారిటీ వస్తుందని తెలిపారు. 

గవర్నర్ తో కాబోయే సీఎం ఉద్ధవ్ ఠాక్రే భేటీ: ప్రమాణ స్వీకారానికి వేదిక అదే

పదవుల పంపకాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు ప్రపుల్ పాటిల్ తెలిపారు. ఇకపోతే డిసెంబర్ 3 తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రపుల్ పాటిల్ తెలిపారు. ఈ భేటీలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌లతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అహ్మద్‌ పటేల్‌, మాణిక్‌రావ్‌ ఠాక్రే పాల్గొన్నారు.  

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, ఆర్ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలను సైతం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను ఆహ్వానించినట్టు కాంగ్రెస్‌ నేత విజయ్‌ వాడెట్టివర్‌ తెలిపారు. 

కాంగ్రెస్‌తో స్నేహామా: శివసేనతో 20 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న నేత

ప్రమాణ స్వీకారానికి ఆత్మహత్య చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలను ఆహ్వానిస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మహావికాస్ అఘాది కూటమికి చెందిన అన్ని పార్టీల నేతలు హాజరు కావాలని ఇప్పటికే కూటమి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. 

 

click me!