కొడుకు ఓటమిని తలచుకుని బోరున ఏడ్చిన మాజీ సీఎం: మీరు వద్దు, మీ ఓట్లు వద్దంటూ....

By Nagaraju penumalaFirst Published Nov 27, 2019, 6:01 PM IST
Highlights

తన కుమారుడు నిఖిల్ గౌడ ఓటమికి ఓటర్లే కారణమంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో ఉన్న విషయం మరచిపోయిన కుమారస్వామి మీ ఓట్లు వద్దు, ఈ పదవులు వద్దు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 
 

కర్ణాటక: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన కుమారుడు నిఖిల్ ఓటమిని తలచుకుంటూ కుప్పకూలిపోయారు. కేఆర్ పేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కుమారస్వామి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కన్నీరు మున్నీరయ్యారు. 

తన కుమారుడిని మాండ్యా ఓటర్లు ఓడించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రాజకీయాలు వద్దు, సీఎం పోస్టు వద్దంటూ బోరున విలపించారు. తన కుమారుడిని రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించిన మాండ్య ఓటర్లు ఎంపీగా పోటీ చేస్తే ఓడించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 

తన కుమారుడు నిఖిల్ గౌడ ఓటమికి ఓటర్లే కారణమంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో ఉన్న విషయం మరచిపోయిన కుమారస్వామి మీ ఓట్లు వద్దు, ఈ పదవులు వద్దు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

ఇకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జేడీఎస్ పార్టీ. 2018 శాస‌న‌స‌భ‌ ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ ఇవ్వ‌క‌పోవ‌డంతో హంగ్ ఏర్ప‌డింది. దాంతో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కు మద్దతు ప్రకటించడంతో మహారాష్ట్రలో కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. దాంతో మే 23, 2018 న క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేశారు.

అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కుమార స్వామి ప్రభుత్వం కుప్పకూలింది. 2019 జూలై 23న జరిగిన బలనిరూపణ పరీక్షలో కుమారస్వామి ఓడిపోవడంతో ఆయన ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 

అనంతరం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడియూరప్ప ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు మద్దతు పలకడంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 

click me!