దక్షిణాదిలో రెండో రాజధాని ఛాన్స్ లేదు: తేల్చేసిన కేంద్రం

By narsimha lodeFirst Published Nov 27, 2019, 5:44 PM IST
Highlights

దేశానికి రెండో రాజధాని ఆలోచన లేనే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా  కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు సమాధానం ఇచ్చింది.

న్యూఢిల్లీ: దేశానికి రెండో రాజధాని అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

దక్షిణ భారత్‌లో దేశానికి రెండో రాజధానిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందనే ప్రచారం సాగుతున్న తరుణంలో  కేంద్రం ఈ విషయమై స్పష్టత ఇచ్చింది.దేశానికి హైద్రాబాద్‌ను రెండో రాజధానిని చేయాలని ప్రతిపాదనపై కొంత కాలంగా విస్తృతంగా  సాగుతోంది. ఈ తరుణంలో కేంద్రం ఈ విషయమై స్పష్టత ఇచ్చింది.

కాంగ్రెస్ ఎంపీ రామచంద్రరావు ఈ విషయమై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇటీవల మహారాష్ట్ర గవర్నర్, మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విద్యాసాగర్ రావు హైద్రాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయవచ్చని అప్పట్లోనే అంబేద్కర్‌ చేసిన వ్యాఖ్యలను కూడ ఆయన ప్రస్తావించారు.

ఈ మేరకు ఈ నెల మొదటివారంలో బీజేపీ నేత విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలను చర్చకు దారితీశాయి.ఈ పరిణామాల నేపథ్యంలో  రాజ్యసభలో  కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కేంద్రాన్ని ఈ విషయమై ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు  కేంద్రం స్పష్టత ఇచ్చింది. 

click me!