ప్ర‌ధాని స‌భ‌లో మ‌హారాష్ట్రకు అవమానం జ‌రిగింది - ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే

Published : Jun 15, 2022, 04:54 PM ISTUpdated : Jun 15, 2022, 04:58 PM IST
ప్ర‌ధాని స‌భ‌లో మ‌హారాష్ట్రకు అవమానం జ‌రిగింది - ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ ముంబై పర్యటన సందర్భంగా మహారాష్ట్రకు అవమానం జరిగిందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి, డిప్యూటీ సీఎంను మాట్లాడనివ్వకపోవడం బాధాకరమని అన్నారు.

పూణెలోని దేహులో జరిగిన సెయింట్ తుకారాం ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో మహారాష్ట్రకు అవ‌మానం జ‌రిగింద‌ని ఎన్సీపీ ఆరోపించింది. ప్ర‌ధాని స‌భ‌లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు మాట్లాడనివ్వ‌కుండా పీఎంవో అనుమతి నిరాకరించిందని ఆ పార్టీ లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. 

మహాత్మా గాంధీ మనవడిపై ప్రతిపక్షాల ఫోకస్.. ‘ఆలోచిస్తా.. టైం ఇవ్వండి’

ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి.. డిప్యూటీ సీఎం, పూణే సంరక్షక మంత్రికి అనుమతి నిరాకరించడం రాష్ట్రాన్ని అవమానించడమేనని సూలే అభిప్రాయపడ్డారు. ‘‘ ఇది మహారాష్ట్రకు, అక్కడి ప్రజలకు అవమానం. అజిత్ పవార్ అక్కడ మా ప్రతినిధి, కానీ ప్రధాని సమక్షంలో అతని హక్కులు నిరాకరించబడ్డాయి” అని సూలే అన్నారు. ఈ సంఘటనతో తాను చాలా నిరాశకు గురయ్యానని చెప్పారు. 

Agnipath : అగ్నిప‌థ్ స్కీమ్ పై డిఫెన్స్ ఉద్యోగార్ధుల నిర‌స‌న.. బీహార్, యూపీలో ఆందోళ‌న‌లు

ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ కూడా ఈ అంశంపై వ్యాఖ్యానించారు. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావానికి పేరుగాంచిన పవార్‌ను మాట్లాడనివ్వకుండా కావాలనే నిరాకరించారని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ మాట్లాడుతూ.. ఒక డిప్యూటీ సీఎం ప్రసంగించకుండా ఆంక్షలు విధించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతకు ప్రసంగానికి అనుమతి ఇవ్వడం కూడా విచిత్రంగా అనిపిస్తోంద‌ని తెలిపారు.

వైద్యం కోసం ఇంటికి రమ్మన్నారు.. కిడ్నాప్ చేసి పెళ్లి చేశారు..!

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మహారాష్ట్రలోని ముంబాయిలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మహారాష్ట్ర పర్యటనలో భాగంగా గవర్నర్‌ హౌస్‌లో జల్‌భూషణ్‌ భవన్‌, విప్లవకారుల గ్యాలరీని ప్రారంభించారు. దీని తర్వాత, ముంబైకి చెందిన ప్రతిష్టాత్మక వార్తాపత్రికలలో ఒకటైన ముంబై సమాచార్ 200వ వార్షికోత్సవం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక తపాలా స్టాంపును విడుదల చేశారు.

ఢిల్లీలో కార్యకర్తలపై పోలీసుల దాడులు: రేపు రాజ్‌భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు

కాగా ప్ర‌ధాని ముంబైకి చేరుకున్న స‌మ‌యంలో ఆదిత్య ఠాక్రేను అడ్డుకుంది. ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లికేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు, రాష్ట్ర కేబినెట్ మంత్రి ఆదిత్య థాకరే ఒకే కారులో ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అయితే.. మంత్రి ఆదిత్య థాక‌రేను గమనించి  పీఎం భద్రతా సిబ్బంది ఆయ‌న‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌ధాని మోదీకి స్వాగతం పలికే వీఐపీల జాబితాలో ఆదిత్య థాక‌రే పేరు లేదని, అందువల్ల ఆయ‌న‌ను సీఎం ఉద్ద‌వ్ థాక‌రే కారు నుంచి దిగిపోవాలని SPG ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !