16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, హత్య: ఆందోళన, చెలరేగిన హింస

By telugu teamFirst Published Jul 20, 2020, 7:31 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ లో బిజెపి స్థానిక నేత సోదరిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్ లోని సంఘటనా స్థలం ఆందోళనలతో అట్టుడుకుతోంది.

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణ సంఘటన జరిగింది. రాష్ట్రంలోని ఉత్తర దినాజ్ పూర్ కాలాగాచ్ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఆందోళన హింసాత్మకంగా మారింది. పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు. మృతురాలు స్థానిక బిజెపి బూత్ ప్రెసిడెంట్ సోదరి అని పశ్చిమ బెంగాల్ బిజెపి రాష్ట్ర శాఖ తెలిపింది. 

మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని బిజెపి ఆరోపించింది. హింస చెలరేగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. 

ఘటనపై బిజెపి డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా తీవ్రంగా మండిపడ్డారు. తృణమూల్ కాంగ్రెసు గూండాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.

click me!