Lakhimpur Kheri case: ఆశిష్ మిశ్రానే ప్రధాన నిందితుడు, 5 వేల పేజీలతో చార్జీషీట్ దాఖలు

Published : Jan 03, 2022, 03:38 PM IST
Lakhimpur Kheri case: ఆశిష్ మిశ్రానే ప్రధాన నిందితుడు, 5 వేల పేజీలతో చార్జీషీట్ దాఖలు

సారాంశం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరీలో  జరిగిన హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది మరణించిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా సహా 14 మందిపై దర్యాప్తు అధికారులు చేర్చారు.

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని Lakhimpur Kheri  ఘటనలో ప్రధాన నిందితుడిగా కేంద్ర  హోంశాఖ సహాయ మంత్రి Ajay Kumar Mishra తనయుడు Ashish Mishra  పేరును చార్జీషీట్ లో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై 5 వేల పేజీల చార్జీషీట్ ను సోమవారం నాడు Court సమర్పించారు దర్యాప్తు అధికారులు.

గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, లఖింపూర్ ఖేరీ పర్యటనకు మందు ఈ ఘటన చోటు చేసుకొంది. నూతన  వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై నుండి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారును నడిపించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఓ జర్నలిస్ట్, ఇద్దరు Bjp కార్యకర్తలు, ఓ డ్రైవర్ మరణించారు. ఈ  విషయం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది.

also read:లఖీంపూర్ ఖేరీలో బీజేపీ కార్యకర్తలపై దాడి ఘటనలో ఇద్దరు రైతులను అరెస్టు చేసిన సిట్

ఈ ఘటన జరిగిన సమయంలో సంఘటన స్థలంలోనే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్టుగా చార్జీషీట్ లో పేర్కొన్నారు దర్యాప్తు అధికారులు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో తాను లేనని కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా గతంలోనే 10 వీడియోలను, అఫిడవిట్ లను కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే.

ఈ కేసులో మరొకరి పేరును కూడా చార్జీషీట్ లో దర్యాప్తు అధికారులు చేర్చారు.  ఈ కేసులో నిందితుల సంఖ్య 14కి చేరింది. ఈ కేసులో వీరేంద్ర శుక్లా అనే మరో వ్యక్తి పేరును కూడా Charge sheet  లో పేర్కొన్నారు దర్యాప్తు అధికారులు నిందితుడిపై ఐపీసీ 201 సెక్షన్ కింద అభియోగాలు మోపారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రా, మాజీ కేంద్ర మంత్రి అఖిలేష్ దాస్ మేనల్లుడు అంకిత్ దాస్ సహా 13 మందిపై గతంలోనే దర్యాప్తు అధికారులు నిందితులుగా చేర్చారు. లఖీంపూర్ ఖేరీ ఘటన లో ముగ్గురు ఎస్‌యూవీల డ్రైవర్లు, మిశ్రా, దాస్‌ల సహచరులతో సహా 13 మందిని ఇప్పటికే police  అరెస్టయ్యారు. వీరంతా లఖీంపూర్ జైలులో ఉన్నాడు.

ఆశిష్ మిశ్రా బెయిల్ ధరఖాస్తుపై అలహాబాద్ హైకోర్టు ఇంకా విచారణ చేయాల్సి ఉంది. ఇందర నిందితుల బెయిల్ పిటిషన్లను స్థానిక కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. ఆశిష్ మిశ్రాతో పాటు మరో 12 మంది నిందితులపై హత్యాయత్నం తో పాటు తీవ్రంగా గాయపర్చిన రెండు అభియోగాలను సిట్ చార్జీషీట్ లో పొందుపర్చింది.

Sit అభ్యర్ధనను అంగీకరించిన కోర్టు ఆయుధాల చట్టంలోని సెక్షన్లతో సహా అభియోగాలను చేర్చాలని ఆదేశించింది.నలుగురు రైతులు, జర్నలిస్టులను హింసాత్మకంగా చంపడం ముందస్తు కుట్రలో భాగంగానే జరిగిందని దర్యాప్తు అధికారులు కోర్టుకు సమర్పించిన చార్జీషీట్ లో పేర్కొన్నారు.

నిర్లక్ష్యం లేదా నిర్లక్ష్యానికి కారణంగా ఈ మరణాలు సంబవించలేదని చార్జీషీట్ లో పోలీసులు పేర్కొన్నారు. నిందితుల చర్యలు హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాయని సిట్ అధికారులు చార్జీషీట్ లో పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..