ఒమిక్రాన్ వేవ్ మొదలైంది.. 84శాతం కేసులు కొత్త వేరియంట్‌తోనే.. వారంలో పీక్‌కు.. : ప్రభుత్వం

By Mahesh K  |  First Published Jan 3, 2022, 3:16 PM IST

ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆ కేసుల్లోనూ ఒమిక్రాన్ కేసులు ఉండటం కలవర పెడుతున్నాయి. ఢిల్లీలో నమోదయ్యే మొత్తం కరోనా కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ అన్నారు.  అంటే ఢిల్లీలో ఒమిక్రాన్ వేవ్ ప్రారంభమైనట్టూ తెలుస్తున్నదని తెలిపారు. అంతేకాదు, వారం రోజుల వ్యవధిలో ఈ కేసులు పీక్ స్టేజ్‌కు వెళ్లతాయనీ వివరించారు.
 


న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ(Delhi)లలో అత్యధికంగా ఈ వేరియంట్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఢిల్లీలో నమోదయ్యే మొత్తం కేసుల్లో కెల్లా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. సోమవారం ఈ విషయమై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసు(Corona Cases)ల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని వివరించారు. డిసెంబర్ 30, 31వ తేదీల్లోని జీనోమ్ సీక్వెన్సింగ్ వివరాలు పరిశీలిస్తే.. ఢిల్లీలో నమోదు అవుతున్న మొత్తం కేసుల్లో 84 శాతం కొత్త వేరియంట్ కేసులే ఉన్నట్టు అర్థం అవుతున్నదని తెలిపారు. అంటే.. ఢిల్లీలో ఒమిక్రాన్ కారణంగా కొత్త వేవ్(New Wave) ప్రారంభమైందని అన్నారు. అంతేకాదు, ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఆరు శాతానికి పెరిగిందని చెప్పారు. వారం రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో కేసులు పీక్ స్థాయికి వెళ్లవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టు వివరించారు.

ఢిల్లీలో గత నెల చివరి వారం నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. డిసెంబర్ నెలలో ఢిల్లీలో 7,277 కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ స్థాయిలో కేసులు గత జూన్‌లో నమోదయ్యాయి. జూన్‌లో ఢిల్లీలో కేసులు 7,948 కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ నెలలో రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. శనివారం ఢిల్లీలో 2,716 కరోనా కేసులు నమోదు కాగా, ఆదివారం ఈ సంఖ్య మరింత పెరిగి 3,194 కేసులు నమోదయ్యాయి. అంటే.. ఈ నెలలో రెండు రోజుల్లోనే కరోనా కేసులు 5,190 నమోదయ్యాయి. ఈ రెండు రోజుల్లో రిపోర్ట్ అయిన కేసులు.. గత ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ వరకు నమోదైన మొత్తం కేసుల కన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఢిల్లీలో 4,669 కరోనా కేసులు నమోదయ్యాయి.

Latest Videos

undefined

Also Read: ఒమిక్రాన్ స‌హ‌జ వ్యాక్సిన్ కాదు. అది త‌ప్పుడు అభిప్రాయం- ప్ర‌ముఖ వైరాల‌జిస్ట్ షాహిద్ జమీల్

ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని ఇటీవలే పేర్కొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. అయితే, ఆ కారణంగా భయపడాల్సిన అవసరం లేదని వివరించారు. ఇదే తీరుగా ఢిల్లీ అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరిగినా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ అధీనంలోని హాస్పిటళ్లలో, క్లినిక్‌లలో మెడికల్ సిబ్బంది కొరత లేదని వివరించారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది గురించి బీజేపీ ఎమ్మెల్యే ఓ పీ శర్మ వేసిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే, వైద్యుల కొరత లేదని వివరించారు. అంతేకాదు, మెడికల్ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం నియామకాలు చేపట్టాలని యూపీఎస్‌సీ, డీఎస్ఎస్ఎస్‌బీలకూ లేఖ రాసినట్టు తెలిపారు.

సోమ‌వారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుత వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 33,750 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డ‌వారి సంఖ్య 3,49,22,882 కు చేరింది. నిన్న‌టితో పోలిస్తే.. 22 శాతం కొత్త కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్ర‌స్తుతం 1,45,582 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో కొత్త‌గా 10,846 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,95,407కు పెరిగింది. 

Also Read: Supreme Court కీల‌క నిర్ణ‌యం.. మ‌ళ్లీ వర్చువల్‌గా కేసుల విచారణ

ఆదివారం కొత్తగా 123 ఒమిక్రాన్‌ కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 1700కు చేరింది. ఇప్పటివరకు 639 మంది కోలుకున్నారు. దేశంలోని ఒమిక్రాన్‌ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో 510 కేసులు నమోదయ్యాయి. తర్వాత ఢిల్లీ 351, కేరళ 156, గుజరాత్‌ 136, తమిళనాడు 121, రాజస్థాన్‌ 120, తెలంగాణ 67, కర్ణాటక 64, హర్యానా 63 చొప్పున ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.  నమోదయ్యాయి.

click me!