ఐశ్వర్య మృతి: ఫీజుల తగ్గింపు, ల్యాప్‌టాప్ ల కోసం కమిటీ ఏర్పాటు

By narsimha lodeFirst Published Nov 22, 2020, 10:27 AM IST
Highlights

న్యూఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో ఫీజులను తగ్గించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన  ఐశ్వర్య ఇటీవల ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. దీంతో కాలేజీ ఈ నిర్ణయం తీసుకొంది.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో ఫీజులను తగ్గించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన  ఐశ్వర్య ఇటీవల ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. దీంతో కాలేజీ ఈ నిర్ణయం తీసుకొంది.

చదువుకొనేందుకుగాను  ఆర్ధిక సమస్యలు  ఇబ్బంది పెట్టడంతో  ఐశ్వర్య ఆత్మహత్యచేసుకొంది. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ఐశ్వర్య కుటుంబానికి   ల్యాప్ టాప్ కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు ఏర్పాడ్డాయి. తన కుటుంబానికి ఆర్ధికంగా భారం కాకూడదనే ఉద్దేశ్యంతో ఐశ్వర్య ఆత్మహత్య చేసుకొంది.

also read:ల్యాప్‌టాప్ లేదు, హాస్టల్ మూత: ఐశ్వర్య ఆత్మహత్యకు కారణమిదీ...

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు విద్యార్ధి సంఘాలు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

విద్యార్ధుల ఆందోళనల నేపథ్యంలో లేడీ శ్రీరాం కాలేజీ కొన్ని కోర్సుల ఫీజులను తగ్గిస్తున్నట్టుగా తాజాగా ప్రకటించింది.విద్యార్దులకు అవసరమైన ల్యాప్‌టాప్ లను అందించేందుకు కూడ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

కాలేజీ హాస్టల్ ను మూసివేశారు.దీంతో ఈ ఏడాది ఫీజులను తగ్గిస్తున్నట్టుగా కాలేజీ యాజమాన్యం ప్రకటించింది.ఫీజును కూడ వాయిదాల పద్దతిలో చెల్లించేందుకు కాలేజీ యాజమాన్యం అవకాన్ని కల్పించింది. 

కరోనా తగ్గిన తర్వాత అవసరాన్ని బట్టి రెండు మూడు విడతల్లో విద్యార్ధులకు హాస్టల్ వసతిని కల్పించాలని భావిస్తోంది. విద్యార్ధులకు అవసరమయ్యే ల్యాప్‌టాప్ తో పాటు ఇతర పరికరాలను అందించేందుకు కమిటీ పరిశీలించనుంది. విద్యార్ధులు ఇచ్చిన చిరునామాకే వాటిని పంపనున్నారు.

ఐశ్వర్య మృతి తర్వాత విద్యార్ధి సంఘాల డిమాండ్ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం  ఈ నిర్ణయం తీసుకొంది.

click me!