విషమంగా తరుణ్ గొగొయ్ ఆరోగ్యం: వెంటిలేటర్‌పై చికిత్స

Siva Kodati |  
Published : Nov 21, 2020, 10:25 PM IST
విషమంగా తరుణ్ గొగొయ్ ఆరోగ్యం: వెంటిలేటర్‌పై చికిత్స

సారాంశం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగొయి ఆరోగ్యం విషమంగా మారింది. శరీరంలోని పలు అవయవాల పనితీరు క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌ సపోర్ట్‌పై ఉన్నట్టు ఆయన తనయుడు, ఎంపీ గౌరవ్‌ గొగొయి వెల్లడించారు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగొయి ఆరోగ్యం విషమంగా మారింది. శరీరంలోని పలు అవయవాల పనితీరు క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌ సపోర్ట్‌పై ఉన్నట్టు ఆయన తనయుడు, ఎంపీ గౌరవ్‌ గొగొయి వెల్లడించారు. 85 ఏళ్ల గొగొయి అక్టోబర్‌లో అస్వస్థతకు గురికావడంతో గువాహటి వైద్య కళాశాలకు తరలించారు.

నాటి నుంచి గొగొయి అక్కడే ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అనంతరం ప్లాస్మా థెరఫీ చేయించుకోవడం ద్వారా కోలుకున్న తరుణ్ గొగొయ్ అక్టోబర్‌ 25న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మూడు సార్లు అసొం ముఖ్యమంత్రిగా పనిచేసిన గొగొయి ఆరోగ్య పరిస్ధితిని తొమ్మిది మంది వైద్యులతో కూడిన బృందం పర్యవేక్షిస్తోంది.  

PREV
click me!

Recommended Stories

World Coldest Place : ఫ్రిజ్‌లో ఉన్నట్టే.. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్ ఇదే గురూ !
పేదరిక నిర్మూలనకు సరికొత్త ఫార్ములా.. ఇక గ్రామాల బాధ్యత విద్యార్థులదే