వివాహమైన మాజీ ప్రియుడి కిడ్నాప్.. బలవంతంగా అతడిని మళ్లీ పెళ్లి చేసుకున్న మాజీ ప్రియురాలు..

Published : Aug 13, 2023, 06:51 AM IST
వివాహమైన మాజీ ప్రియుడి కిడ్నాప్.. బలవంతంగా అతడిని మళ్లీ పెళ్లి చేసుకున్న మాజీ ప్రియురాలు..

సారాంశం

వివాహమైన మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసి, అతడితో తన మెడలో బలవంతంగా తాళి కట్టించుకుంది ఓ యువతి. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఆ యువకుడి భార్య ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆ యువతీ యువకులిద్దరూ ప్రేమికులు. ఏడు సంవత్సరాల పాటు వీరి ప్రేమ కొనసాగింది. అయితే తరువాత ఏం జరిగిందో ఏమో గానీ.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆ బంధానికి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. ఎవరిదారి వారు చూసుకోవాలని భావించి, ఇద్దరి సమ్మతితో విడిపోయారు. కొంత కాలం తరువాత ఆ యువకుడు తన ఉద్యోగిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలియడంతో మాజీ ప్రియురాలికి అసూయ కలిగింది. దీంతో మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుంది. 

TSPSC: గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్ష నవంబర్‌కు వాయిదా

గంధర్వ వివాహాన్ని తలపించే ఈ విచిత్ర పెళ్లి తమిళనాడులో తాజాగా వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని వేళచ్చేరి ప్రాంతానికి చెందిన పార్తిబన్, రాణిపేట ప్రాంతంలో నివసించే సౌందర్యలు కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. తరువాత వీరి పరిచయం ప్రేమగా మారింది. ఏడు సంవత్సరాల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. తరువాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో సామరస్యంగా విడిపోయారు. 

ఎవరి లైఫ్ లో వారు పడిపోయారు. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న పార్తిబన్.. ఐటీలో ఉద్యోగం చేసుకునే యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల సమక్షంలో వీరి వివాహం గత నెల 5వ తేదీన జరిగింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా సౌందర్యకు తెలిసింది. తన ప్రియుడి విషయంలో తప్పు చేశానని భావించిందో ఏమో తెలియదు కానీ.. పార్తిబన్ తన వాడు కావాలని కోరుకుంది. ఈ విషయాన్ని తల్లి, బంధువులకు తెలియజేసింది. అతడిని పెళ్లి చేసుకుంటానని మొండికేసింది. 

ఈ నెల 19, 20 తేదీల్లో రెండు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన

దీంతో వారు కూడా ఒప్పుకోకతప్పలేదు. పార్తిబన్ ను కిడ్నాప్ చేసి పెళ్లి చేయాలని బంధువులు, తల్లి ప్లాన్ వేశారు. శుక్రవారం ఎప్పటిలాగే పార్తిబన్ ఆఫీస్ కు బయలుదేరాడు. ఈ క్రమంలో వారంతా వచ్చి, కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లిపోయారు. అతడిని సరాసరి కాంచీపురంలో ఉన్న ఆ దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న సౌందర్య మెడలో పార్తిబన్ తో బలవంతంగా తాళి కట్టించి, వివాహ తంతును పూర్తి చేశారు. 

మందుల పేర్లు స్పష్టంగా రాయాలి.. జనరిక్ మెడిసిన్స్‌నే రాయాలి: డాక్టర్లకు కేంద్రం హెచ్చరిక

ఈ కిడ్నాప్ విషయం పార్తిబన్ భార్యకు తెలిసింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. వెంటనే దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కిడ్నాప్ జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను గుర్తించారు. అనంతరం వారు నివసించే ప్రాంతానికి వెళ్లారు. సౌందర్య, ఆమె బంధువులను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు