newsclick : న్యూస్‌క్లిక్‌‌కు షాక్.. ట్విట్టర్ ఖాతా సస్పెండ్

Siva Kodati |  
Published : Aug 12, 2023, 09:35 PM IST
newsclick : న్యూస్‌క్లిక్‌‌కు షాక్.. ట్విట్టర్ ఖాతా సస్పెండ్

సారాంశం

న్యూస్‌క్లిక్ మీడియా సంస్థకు మైక్రోబ్లాగింగ్ సైట్ X (గతంలో ట్విట్టర్) షాకిచ్చింది. ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. న్యూస్‌క్లిక్ మీడియా సంస్థ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 255 మంది ప్రముఖులు రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన మరుసటి రోజే ట్విట్టర్ ఈ చర్యకు దిగడం గమనార్హం. 

మైక్రోబ్లాగింగ్ సైట్ X (గతంలో ట్విట్టర్) భారతదేశంలోని ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ NewsClick ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసింది. చైనా నుంచి నిధులు పొంది, భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న కొద్ది రోజుల్లోనే ట్విట్టర్ ఈ చర్య తీసుకుంది. శనివారం నాటికి, న్యూస్‌క్లీన్ మీడియా యొక్క ట్విట్టర్ ఖాతా, 'ఖాతా సస్పెండ్ చేయబడింది... ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించే ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేస్తుంది' అనే సందేశాన్ని ప్రచురించింది. 

చైనాతో సంబంధం ఉన్న సంస్థల నుంచి న్యూస్‌క్లిక్ మీడియా సంస్థ నిధులు అందుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో న్యూస్‌క్లిక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 255 మంది ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్‌లకు బహిరంగ లేఖ రాశారు. దేశ-వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

లేఖలో ఏం పేర్కొన్నారంటే..

భారత వ్యతిరేకుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన భారతీయులుగా ఈ లేఖ రాస్తున్నాం. నకిలీ వార్తలు, తమ స్వార్థం కోసం న్యూస్‌క్లిక్‌ (న్యూస్ పోర్టల్) దేశ ప్రయోజనాలను  తాకట్టు పెడుతుందని, ఈ విషయం న్యూయార్క్ టైమ్స్ పరిశోధనలో బహిర్గతమైందని వెల్లడించారు.  మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘం ద్వారా నిధులు అందుకుంటున్న సంస్థగా న్యూయార్క్ టైమ్స్ దర్యాప్తులో తేలింది. న్యూస్‌క్లిక్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ మొత్తం 255 మంది ప్రముఖ పౌరులు రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తులకు బహిరంగ లేఖలు రాశారు. 

ALso Read: "న్యూస్‌క్లిక్ పై చర్యలు తీసుకోవాలి" : రాష్ట్రపతి, సీజేఐలకు 255 మంది ప్రముఖుల లేఖ

దేశవ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక ఎజెండా గలవారిని బహిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. చైనా ఆదేశానుసారం న్యూస్‌క్లిక్ అనే వార్తా పోర్టల్ కు మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘం నిధులు సమకూరుతున్నాయి. న్యూయార్క్ టైమ్స్ పరిశోధన ఈ విషయం బహిర్గతమైంది.

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నా..  విదేశీ శక్తుల ప్రయోజనాల కోసం మన ప్రజాస్వామ్య ప్రక్రియలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అటువంటి శక్తులను మనం అరికట్టకూడదా ? అనే ప్రశ్న తలెత్తుతుంది. హేతువాదం, దేశభక్తి, నిజాయితీ స్వరాన్ని అణచివేయడానికి ఇలాంటి శక్తులను మనం అనుమతించగలమా? నకిలీ వార్తలను వ్యాప్తి చేయడంలో అపఖ్యాతి పాలైన న్యూస్ మీడియా పోర్టల్ న్యూస్‌క్లిక్.. భారతదేశానికి బహిరంగ శత్రువుగా భావిస్తున్న దేశం(చైనా)తో సంబంధాలున్నట్టు తేలిందనే విషయాన్ని ప్రస్తవించారు.

ఇలాంటి సంస్థలు భారత ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలహీనపరచాలనుకుంటున్నారు. పత్రికా స్వేచ్ఛ పేరుతో చైనా నుంచి రహస్యంగా నిధులు తీసుకుంటూ మన ప్రజాస్వామ్యాన్ని సవాలు చేస్తున్నారు. ఇది చైనా మౌత్‌పీస్‌ మారిందనీ, అనేక ఆందోళన కలిగించే సందర్భాలు ఉన్నాయి. భారతదేశంలోని ఇతర రాజకీయ నాయకులు NewsClickకి నిధులు సమకూర్చే NGOలో భాగస్వాములుగా పనిచేస్తున్నారు. ఇది చాలా దారుణమైన కుట్ర అని పేర్కొన్నారు. న్యూస్‌క్లిక్ రాఫెల్ డీల్‌పై కవరేజీ చేయడం, అదే సమయంలో ప్రతిపక్షాల ప్రశ్నలను లేవనెత్తడాన్ని ఎజెండాగా మార్చుకుంది. 

తక్షణమే చర్యలు తీసుకోవాలి

న్యూస్‌క్లిక్ వెబ్‌సైట్‌పై విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేఖ రాసినవారిలో మాజీ రాయబారి భష్మతీ ముఖర్జీ, మాజీ డీజీపీ బీఎల్ బోహ్రా, మాజీ జస్టిస్ కె. శ్రీధర్ రావు, మాజీ జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా, మాజీ జస్టిస్ ఆర్కే మరాఠియా, మాజీ న్యాయమూర్తి ఆర్ఎస్ రాథోడ్, మాజీ జస్టిస్ ఎంసీ గార్గ్, మాజీ ఐఏఎస్ యోగేంద్ర నారాయణ్, మాజీ ఐఏఎస్ ఎల్సీ గోయల్, ఐపీఎస్ సంజీవ్ త్రిపాఠి సహా 255 మంది ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !