Kharif Crops MSP Hike: రైతులకు గుడ్ న్యూస్

Published : May 28, 2025, 06:16 PM IST
pm modi farmer 3

సారాంశం

Kharif Crops MSP Hike: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచింది.  ఎంఎస్పీ పెంపుతో పాటు రైతు రుణాలపై వడ్డీ రాయితీని కూడా ప్రకటించింది.

Kharif Crops MSP Hike: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల‌ను (ఎంఎస్‌పీ) ప్రకటించింది. దీనిలో భాగంగా పలు ప్రధాన పంట‌ల‌కు మద్దతు ధర పెంచినట్టు అధికారికంగా ప్రకటించారు.

 ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (PIB) ద్వారా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ ఏడాది మద్దతు ధరల్లో కొన్ని పంటల‌కు గణనీయంగా పెరుగుదల ఉంది. ఖరీఫ్ పంటల MSPని ఖర్చు కంటే 50% ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు రైతులకు రుణాలపై వడ్డీ రాయితీ కూడా ఇవ్వనున్నారు.

పంటలు- కనీస మద్దతు ధరలు (MSP-(క్వింటాల్‌కు)

వరి (సాధారణ)- రూ.2369

వరి (గ్రేడ్ A)- రూ. 2389

జొన్న (హైబ్రిడ్)- రూ.3699

జొన్న (లోకల్)- రూ.3749

సజ్జ- రూ.2775

రాగులు- రూ.4886

మొక్కజొన్న- రూ.2400

కంది- రూ.8000

పెసర- రూ.8768

మినుములు- రూ.7800

నువ్వులు (మధ్యస్థం)- రూ.7710

నువ్వులు (పొడవు)- రూ.8110

పల్లీలు- రూ.7263

సన్ ఫ్లవర్- రూ.7721

సోయాబీన్- రూ.5328

నువ్వులు- రూ. 9846

నైజర్ సీడ్స్- రూ.9537

రుణాల వడ్డీపై రైతులకు రూ.15,642 కోట్ల రాయితీ

రైతు రుణాల వడ్డీపై రూ.15,642 కోట్ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినట్లుగా, ఈ రాయితీ కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా ఇచ్చే రుణాలపై వర్తిస్తుంది.  కేసీసీ ద్వారా రైతులకు రూ.2 లక్షల వరకు రుణం లభిస్తుంది. దీనిపై వడ్డీ సంవత్సరానికి 7 శాతం ఉంటుంది. ప్రభుత్వం 1.5% వడ్డీ రాయితీ ఇస్తుంది. సకాలంలో రుణం తీర్చిన రైతులకు సంవత్సరానికి 3% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

దేశంలో 7.75 కోట్లకు పైగా KCC ఖాతాలు

దేశంలో 7.75 కోట్లకు పైగా KCC ఖాతాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. వ్యవసాయానికి సంస్థాగత రుణ ప్రవాహాన్ని కొనసాగించడానికి ఈ మద్దతు కొనసాగించడం చాలా ముఖ్యం. ఇది ఉత్పాదకతను పెంచడానికి, చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి కీలకం. 2014లో KCC ద్వారా రూ.4.26 లక్షల కోట్ల రుణం ఇవ్వగా, డిసెంబర్ 2024 నాటికి అది రూ.10.05 లక్షల కోట్లకు పెరిగింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు